సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మూడు రోజుల లాభాలకు బ్రేక్ చెప్పి ఆరంభంలో నష్టాల బాట పట్టాయి. అయితే లాభానష్టాల సయ్యాట కొనసాగుతోంది. ఇన్వెస‍్టర్ల కొనుగోళ్లతో సెన్సెక్స్ 36 పాయింట్లు ఎగిసి 35,965 వద్ద నిఫ్టీ 6 పాయింట్ల నామామాత్రపు లాభాలతో 10,797వద్ద ట్రేడవుతోంది.
ప్రధానంగా రియల్టీ 0.6 శాతం పుంజుకోగా.. ఫార్మా 0.6 శాతం క్షీణించింది.నిఫ్టీ దిగ్గజాలలో ఎయిర్‌టెల్ దాదాపు 6 శాతం జంప్‌చేయగా, ఐవోసీ, గ్రాసిమ్, ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, ఐబీ హౌసింగ్, యస్ బ్యాంక్, అల్ట్రాటెక్, హెచ్‌పీసీఎల్, ఇన్ఫోసిస్ లాభపడుతున్నవాటిల్లో ఉన్నాయి. అయితే హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ, బజాజ్ ఆటో, టైటన్, యూపీఎల్, జీ, యాక్సిస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, కోల్ ఇండియా నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment