భారత్‌లో కోవిడ్-19 కేసులు రోజురోజూకూ పెరుగుతున్నప్పటికీ.., ఈక్విటీ సూచీలు ర్యాలీ చేయడం పట్ల సంప్రాదాయ ఇన్వెసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో దలాల్ స్ట్రీట్‌లోకి కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్లు ఇబ్బడిముబ్బడిగా షేర్లను కొనుగోళ్లు చేయడంతో సూచీల రికవరీకి కారణం అవుతున్నట్లు వారు భావిస్తున్నారు. భారత్‌లో ఈ లాక్‌డౌన్ విధింపు నుంచి ఏకంగా 18 లక్షల కొత్త డీ-మాట్ అకౌంట్లు పుట్టుకొచ్చాయి.
ఈ రంగాల షేర్లపై ఎక్కువ మక్కువ చూపారు
మార్చి నెల ద్వితీయార్థం నుంచి జరిగిన కరెక‌్షన్‌ను సొమ్ము చేసుకోవడానికి కొత్త ఇన్వెస్టర్లు దలాల్ స్ట్రీట్‌లోకి ప్రవేశించారు. లాక్‌డౌన్ సడలింపు ఆర్థిక వ్యవస్థ అనుకున్న దానికన్నా వేగంగా రికవరీ అవుతుందనే అంచనాలు వారిని మార్కెట్లో నడింపిచాయి. ఈ క్రమంలో వారు భారీ పతనాన్ని చవిచూసిన ఫైనాన్స్, టెలికాం, ఫార్మా రంగాలకు షేర్లను పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేసారు.
అధిక రాబడులు ఉత్సాహానిస్తున్నాయి
తక్కువ సమయంలో అధిక రాబడులు ఉత్సాహానిస్తున్నట్లు మార్చిలో కొత్త ట్రేడింగ్ అకౌంట్‌ను తెరిచిన మాన్సీ సాగర్ తెలిపారు. స్నేహితుల సలహాల మేరకు ఈ మార్చిలో స్టాక్ మార్కెట్లో కొంత మొత్తంలో పెట్టుబడులు పెట్టానని ఆయన తెలిపారు. ఇప్పుడు మార్కెట్ ర్యాలీతో పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని ఆయన తెలిపారు. అయితే ఎల్లకాలం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టనని ఆయన తెలిపారు.
సైక్లికల్స్ రంగ షేర్లను కొన్న రీటైల్ ఇన్వెస్టర్లు
లాక్‌డౌన్ సమయంలో పతనాన్ని చవిచూసిన సైక్లికల్స్ రంగ షేర్ల కొనుగోళ్లకు రీటైల్ ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతున్నారు. ఈ సంఘటన మార్కెట్‌లో చెత్త ప్రదర్శనకు ముగింపుపడినట్లు అవగతమవుతోంది. విస్తృత స్థాయి మార్కెట్ వ్యాల్యూయేషన్‌తో పోలిస్తే ఇప్పటికీ అటో, ఇంధన, మెటల్ స్టాక్స్ వాల్యూయేషన్లు ఇంకా కనిష్ట స్థాయిలోనే ఉన్నాయి.
కరోనా వైరస్ వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కోవడానికి ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు చర్యలు, కేంద్రం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటనతో మార్చి 23న కనిష్టం నుంచి సెన్సెక్స్ 36శాతం రివకరీ అయ్యింది. సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్ రంగ షేర్లు ఈ ఏడాది ప్రారంభం నుంచి 31శాతం నష్టాన్ని చవిచూశాయి. అయితే ఫార్మా షేర్లు మాత్రం లాభపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment