భారత స్టాక్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ గణనీయంగా పెరుగుతోంది. గడచిన 4రోజుల్లో ఏకంగా 2లక్షల మంది కొత్త ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టినట్లు బీఎస్‌ఈ ఎక్చ్సేంజ్ గణాంకాలు చెబుతున్నాయి. నెలరోజుల్లో 11లక్షల మంది, 3నెలల్లో 2.5లక్షల మంది, ఏడాది కాలంలో 1.3కోట్ల మంది స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు డీమాట్ ఖాతాలు తెరిచారు. మొత్తంగా స్టాక్‌మార్కెట్ రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య 5.2కోట్లుగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
మహారాష్ట్ర నుంచి అధికంగా:
కొత్తగా మార్కెట్లోకి ప్రవేశించిన ఈ 2లక్షల మంది ఇన్వెస్టర్లలో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 30వేల మంది ఉన్నారు. ఆంద్రప్రదేశ్ నుంచి 10,657 మంది, గుజరాత్ నుంచి 10,416 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 10,023 మంది, తెలంగాణ నుంచి 9,015 మంది ఉన్నారు. ఇక మిగిలిన వారు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు చెందిన వారుగా ఉన్నారు.
ఆకట్టుకుంటున్న స్టాక్‌మార్కెట్ ర్యాలీ:
స్టాక్‌మార్కెట్లో అటు ఇండెక్స్‌లు, ఇటు ఆయా షేర్లు భారీ ర్యాలీ చేస్తున్న నేపథ్యంలో కొత్తవారు స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. కరోనా ప్రేరిపిత లాక్‌డౌన్ విధింపుతో స్టాక్‌మార్కెట్ భారీ పతనాన్ని చూసింది. అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభంతో సూచీల రికవరీ మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మంచి సహకారం లభిస్తుండంతో రికవరీ ర్యాలీ అద్భుతంగా జరుగుతుంది. మార్చి 23న సూచీలు తాకిన కనిష్టస్థాయి నుంచి ఏకంగా 32శాతం లాభపడ్డాయి. అలాగే 2009 జూన్‌లో సెన్సెక్స్ అత్యధికంగా 7.8శాతం లాభపడింది. దాదాపు 11ఏళ్ల తర్వాత ఇదే జూన్‌లో ఈ స్థాయి లాభాలను ఆర్జించింది. జూన్ ర్యాలీ జూలై నెలలో కొనసాగుతుంది.
ఇందుకే రిటైల్ ఇన్వెస్టర్లు పెరిగారు:
కరోనా కట్టడికి లాక్‌డౌన్‌తో విధింపుతో చాలామంది ఇళ్లలో చిక్కుకుపోయారు. అందులో భారీగా డబ్బున్న వారు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. భారత్‌లో బెట్టింగ్ చట్టబద్ధం కాకపోవడంతో ఖాళీ సమయాన్ని గడిపేందుకు ఎలాంటి ఇతర ప్రత్యమ్నాయాలు లేకపోవడంతో వారు ట్రేడింగ్ పట్ల ఆకర్షితులయ్యారు. దాదాపు అన్ని బ్రోకరేజ్ సంస్థలు ఉచిత డీమాట్ ఖాతా ప్రారంభాన్ని అందిస్తున్నాయి. దీనికి తోడు కొత్తవారికి ప్రోత్సాహకాలు, డిస్కౌంట్‌లు ఇస్తుండటం కూడా స్టాక్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్లు పెరిగారు.
Comments
Please login to add a commentAdd a comment