సౌతాఫ్రికా ట్రేడ్ ఫెయిర్ ఆరంభం
హైదరాబాద్: దక్షిణాఫ్రికా 6వ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రేడ్ ఫెయిర్ సోమవారమిక్కడి మాదాపూర్ ట్రైడెంట్ హోటల్‌లో ఆరంభమయింది. దక్షిణాఫ్రికాకు చెందిన 26 కంపెనీలతో పాటు పలువురు భారతీయ ఇన్వెస్టర్లు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని దక్షిణాఫ్రికా పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఉప మంత్రి మిజ్‌వాండిల్ మసీనా, ముంబయిలోని దక్షిణాఫ్రికా కాన్సుల్ జనరల్ పూల్ మల్ఫేన్ ఆరంభించారు.సాధారణ ఎగుమతులతో తమ ట్రేడ్ ఫెయిర్ ఆరంభమయిందని, దీని ద్వారా 2009-2014 మధ్య 44 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దక్షిణాఫ్రికాకు తరలి వచ్చాయని వారు తెలియజేశారు.
ఆఫ్రికాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి దక్షిణాఫ్రికా అనేది వ్యూహాత్మక కేంద్రమని ఈ సందర్భంగా మసీనా చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ ఆంద్రప్రదేశ్ అండ్ తెలంగాణ చాంబర్స్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అద్వర్యంలో వ్యాపార రంగం అబివృద్ది, పెట్టుబడి అవకాశాలపై భారత్, సౌత్‌ఆప్రికా ప్రతినిదులు ఈ సందర్భంగా చర్చించుకున్నారు.