మీకు వచ్చే జీతంలో మీరు ప్రతి నెల ఎంత మొత్తం ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవాలని భావిస్తున్నారా?
స్పెండింగ్ ట్రాకర్
మీకు వచ్చే జీతంలో మీరు ప్రతి నెల ఎంత మొత్తం ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవాలని భావిస్తున్నారా? అలాగే మీ ఖర్చులను వేటి కోసం అధికంగా చేస్తున్నారో ట్రాక్ చేయాలనుకుంటున్నారా? ఎలాంటి తికమక, గందరగోళం లేకుండా సులభంగా మీ ఆర్థిక లావాదేవీలపై పట్టు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారా? అయితే ఇంకేం.. ‘స్పెండింగ్ ట్రాకర్’ అనే పర్సనల్ ఫైనాన్స్ యాప్‌ను ఉపయోగించి చూడండి. మీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఈ స్పెండింగ్ ట్రాకర్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రత్యేకతలు
* సులభ, సహజమైన యూజర్ ఇంటర్‌ఫేస్.
* యాప్‌ను ఓపెన్ చేయగానే టాప్‌లో ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆదాయ వ్యయాలను వారం, నెల వారీగా, సంవత్సరం వారీగా తెలుసుకోవచ్చు.
* యాప్‌లో ప్రధానంగా స్పెండింగ్, ట్రాన్సాక్షన్స్, కేటగిరీస్, అకౌంట్స్ అనే నాలుగు ఆప్షన్లు ఉంటాయి. స్పెండింగ్‌లో మీ ఆదాయ, వ్యయాల వివరాలను యాడ్ చేసుకోవచ్చు. వీటికి నోట్స్ రాసుకోవచ్చు.
* ట్రాన్సాక్షన్‌లో మీ ఆర్థిక లావాదేవీలు కనిపిస్తాయి. కేటగిరీస్‌లో మీరు ఏ ఏ వాటిపై ఖర్చు చేస్తున్నారో..ఏ మార్గంలో ఆదాయం వస్తుందో.. తెలియజేసే అంశాలు ఉం టాయి. వీటికి ఐకాన్స్ సెట్ చేసుకోవచ్చు.
* ట్యాబ్లెట్స్ కోసం ప్రత్యేకమైన లేఔట్ డిజైన్
* మీరు ఏ ఏ అంశాలపై ఎంత మొత్తంలో ఖర్చు చేశారో చూసుకోవచ్చు.
* ప్రతిసారీ చెల్లించాల్సిన బకాయిలను రిమైండర్‌లో పెట్టుకోవచ్చు.
* సేవింగ్స్, బిజినెస్, పర్సనల్ వంటి తదితర అకౌంట్లను రూపొందించుకోవచ్చు.
* ఆదాయ వ్యయాలను ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో చూసుకోవచ్చు.
* ఆటో బ్యాక్‌అప్ ఫీచర్ ఉంది.