రూ.511కే స్పైస్జెట్ టికెట్
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తాజాగా దేశీ విమాన టికెట్లను (ఒకవైపునకు) రూ.511 ధర (పన్నులు, ఫీజులు మినహా) నుంచి అందిస్తోంది. దేశంలో కార్యకలాపాలను ప్రారంభించి 11 ఏళ్లు అవుతున్న సందర్భంగా సంస్థ ఈ మూడు రోజుల పరిమిత కాల ఆఫర్‌ను ప్రకటించింది. ఇది 17న ప్రారంభమై 19 వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ప్రయాణికులు ఈ ఆఫర్‌లో భాగంగా అంతర్జాతీయ విమాన టికెట్‌ను రూ.2,111ల నుంచి పొందొచ్చు. ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుకింగ్ చేసుకున్న దేశీ ప్రయాణికులు జూన్ 15 నుంచి సెప్టెంబర్ 30 వరకు, అంతర్జాతీయ ప్రయాణికులు జూన్ 1 నుంచి జూలై 20 వరకు ఉన్న మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని తెలిపింది. ప్రస్తుత ఆఫర్ కేవలం డెరైక్ట్ విమానాలకు మాత్రమే వర్తిస్తుంది పేర్కొంది.