ట్రాన్స్ ట్రాయ్ రోడ్డు కాంట్రాక్టు రద్దు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిర్మాణ రంగ సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌కి నేషనల్ హైవేస్ అథారిటీ(ఎన్‌హెచ్‌ఏఐ) షాక్ ఇచ్చింది. నిర్మాణం, నిర్వహణ, బదిలీ ప్రాతిపదికన కంపెనీకి 2012 ఏప్రిల్‌లో అప్పగించిన రూ.912 కోట్ల విలువైన రోడ్డు నిర్మాణ ప్రాజెక్టును రద్దు చేసింది. మధ్యప్రదేశ్‌లో 69వ జాతీయ రహదారిలో ఉన్న ఓబెదుల్లాగంజ్-బేతుల్ సెక్షన్‌లో 121.36 కిలోమీటర్ల మేర రోడ్డును 4 లేన్ల రహదారిగా 2016 ఆగస్టు నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటిదాకా 1.34% పనులే పూర్తి కావడంతో ఎన్‌హెచ్‌ఏఈ ఈ నిర్ణయం తీసుకుంది.