సాక్షి, ముంబై: ఆర్‌బీఐ పాలసీ రివ్యూ ప్రకటనతో ఈక్విటీ మార్కెట్లు నెగిటివ్‌గా స్పందిస్తున్నాయి. ఆరంభంనుంచి స్తబ్దుగా ఉన్న సూచీలు రెపో రేటు పెంపుతో డీలా పడ్డాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలతో సెన్సెక్స్ 141 పాయింట్లు క్షీణించి 37,465ని, నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయి 11,316ని తాకింది. వెంటనే తిరిగి పుంజుకున్నా ఊగిసలాట ధోరణి నెలకొంది. మెటల్, బ్యాంక్ నిఫ్టీ, ఆటో నష్టపోతుండగా, ఫార్మా, ఐటీ రంగాలు లాభపడుతున్నాయి. హిందాల్కో, వేదాంతా, ఐషర్, మారుతీ, టాటా స్టీల్, ఐబీ హౌసింగ్, యాక్సిస్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, ఎయిర్‌టెల్ నష్టాలఓలనూ, కోల్ ఇండియా, లుపిన్, డాక్టర్ రెడ్డీస్, ఇన్‌ఫ్రాటెల్, ఐవోసీ, టీసీఎస్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్‌జీసీ లాభాల్లోనూ కొనసాగుతున్నాయి.
కాగా ఆర్‌బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ అధ్యక్షతన మూడు రోజులపాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను పావు శాతం పెంచింది. దీంతో రెపో రేటు 6.5 శాతానికి చేరింది. ఫలితంగా రివర్స్ రెపోను 6 శాతం నుంచి 6.25 శాతానికి సవరించింది. బ్యాంక్ రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్‌ఎఫ్) రేట్లను 6.75 శాతంగా నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment