సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఆరంభంలో సెన్సెక్స్ 800 పాయింట్లు ఎగిసింది. బ్యాంకింగ్, ఫార్మా, ఆటో, ఐటీ ఇలా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభం లాభాలనుంచి స్వల్పంగా వెనక్కి తగ్గినా,తిరిగి పుంజుకున్న సెన్సెక్స్ ప్రస్తుతం 866 పాయింట్ల లాభంతో 30760 వద్ద, నిఫ్టీ 257పాయింట్ల లాభంతో 9012 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. సిప్లా , టాటామోటార్స్, లుపిన్ పది శాతానికిపైగా ఎగిసాయి. ఇంకా వేదాంతా జేఎస్ డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్ర బ్యాంకు, జీ, బజాజ్ ఫిన్ తదితర షేర్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్ రేటును 20 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే 4శాతం లాభపడుతోంది. మరోవైపు హెచ్ యూఎల్, అదానీపోర్ట్స్ స్వల్పంగా నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment