మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లో తాన్లా రికార్డు | tanla record in Messaging Platform | Sakshi
Sakshi News home page

మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లో తాన్లా రికార్డు

Published Fri, Nov 27 2015 1:46 AM | Last Updated on Sun, Sep 3 2017 1:04 PM

మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లో తాన్లా రికార్డు

మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లో తాన్లా రికార్డు

హైదరాబాద్: తాన్లా సొల్యూషన్స్‌కు చెందిన ఏ2పీ (అప్లికేషన్ టూ పర్సన్) మెస్సేజింగ్ హబ్ ‘ఫాస్ట్‌ట్రాక్’ అక్టోబర్‌లో 500 కోట్ల మెసేజ్‌లను ప్రాసెస్ చేసింది. ఒకేరోజు 20 కోట్లకుపైగా మెసేజ్‌లను ప్రాసెస్ చేసి రికార్డు సృష్టించింది. మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఇది ప్రపంచంలోనే ఒక రికార్డని తాన్లా సొల్యూషన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. త్వరితగతిన మెస్సేజ్ ప్రాసెసింగ్, వన్ టైమ్ పాస్‌వర్డ్స్ వంటి కీలక మెసేజ్‌ల విషయంలో లావాదేవీ, భద్రత, డెలివరీ అలర్ట్స్ వంటివి బ్యాంకులకు, ఈ కామర్స్‌కు, రవాణా, సరఫరాల వ్యవస్థ, సోషల్ మీడియాలకు ఎంతో కీలకమని సంస్థ పేర్కొంది.  ఆయా అంశాల్లో తమ సామర్థ్యాన్ని  మెసేజింగ్ హబ్ తెలియచెబుతున్నట్లు ఒక ప్రకటనలో తాన్లా సొల్యూషన్స్ సీఈఓ ఉదయ్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రస్తుత విప్లవాత్మక సాంకేతిక వ్యవస్థలో అప్లికేషన్ టూ పర్సన్ విభాగం కీలకమని ఆయన వివరిస్తూ... ఈ రంగం భవిష్యత్తులో మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. 2018 నాటికి ఏ2పీ మెసేజింగ్‌కు సంబంధించి మార్కెట్ విలువ ప్రపంచవ్యాప్తంగా 60 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. 1999లో స్థాపించిన తాన్లా సొల్యూషన్స్‌లో 300కుపైగా టెలికం నిపుణులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈలో గురువారం సంస్థ షేర్ ధర క్రితంతో పోల్చితే 5.66 శాతం పెరిగి (రూ.2.20) రూ.41.10 వద్దకు ఎగసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement