Messaging
-
త్వరలోనే డిలీట్.. మెటా,ఇన్స్టాగ్రామ్ యూజర్లకు అలెర్ట్!
ఫేస్బుక్ (మెటా) సరిగ్గా మూడేళ్ల క్రితం చాట్ ఇంటిగ్రేషన్ అని ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఆ ఫీచర్ సాయంతో యూజర్లు ఫేస్బుక్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లోని వారి స్నేహితులతో మాట్లాడుకోవడం, వీడియో కాల్స్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇందుకోసం మెటాలో సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది. అయితే తాజాగా, ఆ ఫీచర్‌ను డిసెంబర్ నెలలో డిలీట్ చేస్తున్నట్లు మెటా ప్రకటించింది. మరి ఆఫీచర్ను ఎందుకు తొలగిస్తున్నారనే అంశంపై మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ స్పష్టత ఇవ్వలేదు. కానీ, ఇటీవల యురేపియన్ యూనియన్‌కి చెందిన ప్రభుత్వ సంస్థ యూరోపియన్ కమిషన్ ‘యూరప్ డిజిటల్ మార్కెట్ యాక్ట్ (డీఎంఏ)’ లో కొన్ని మార్పులు చేసింది. వాటికి అనుగుణంగా ఆయా టెక్నాలజీ సంస్థలు మెసేజింగ్ ఫ్లాట్‌ఫామ్‌ల మధ్య క్రాస్ చాటింగ్ సదుపాయం ఉండేలా చూడాలని కోరింది. ఈ సమయంలో మెటా ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. క్రాస్ చాటింగ్ సాదుపాయం లేకపోతే ‘క్రాస్ చాటింగ్ ఫీచర్‌ను తొలిగిస్తే యూజర్ల మధ్య మెసేజ్ పంపుకునే అవకాశాన్ని కోల్పోవడంతో పాటు వీడియో కాల్స్ చేసుకునే వీలుండదు’ అని మెటా తెలిపింది. ఇప్పటికే యూజర్ల మధ్య జరిగిన చాటింగ్‌లు రీడ్-ఓన్లీ మెసేజ్లుగా మారిపోనున్నాయి. అంతేకాదు క్రాస్ చాటింగ్‌కు సంబంధం ఉన్న మెటా అకౌంట్స్‌ను తొలగిస్తామని వెల్లడించింది. ఒకవేళ యూజర్లు చాటింగ్ చేసుకోవాలంటే మెటా అకౌంట్స్ లేదా మెసేంజర్ నుంచి చాటింగ్ చేసుకోవచ్చని పేర్కొంది. -
స్నాప్‌చాట్ వాడుతున్నారా?తస్మాత్ జాగ్రత్తా! లేదంటే..
స్నాప్‌చాట్ అనేది ఈ రోజుల్లో టీనేజర్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్న మోడర్న్ మెసేజింగ్ యాప్. ఇందులో యూజర్లు తమ ఫొటోలు, వీడియోలను స్నాప్లుగా వర్చుకుంటారు. మన ఫ్రెండ్స్ జాబితాలోని వారు వాటిని చూసిన తర్వాత అవి అదృశ్యమవుతాయి. స్నేహితులతో కనెక్ట్ అవడం, గేమ్స్, న్యూస్, వినోదం, క్విజ్లు, వినూత్న ఫొటో, వీడియో ఎడిటింగ్ టూల్స్ వంటి వివిధ ఫీచర్లను ఇది అందిస్తుంది. ఈ ఫీచర్లు, దాని ఇంటరాక్టివ్ నేచర్, సృజనాత్మకత కారణంగా స్నాప్‌చాట్ వినియోగదారులను... ముఖ్యంగా యువతను ఆకర్షిస్తోంది. స్నాప్‌చాట్ అకౌంట్.. హ్యాకింగ్, సెక్సార్షన్, సైబర్ బెదిరింపు, మోసం వంటి వివిధ సైబర్ నేరాలకు అవకాశం ఇచ్చేలా ఉంది. ఇవి యూజర్ల వ్యక్తిగత సమాచారానికి తీవ్రమైన నష్టాలను కలిగిస్తాయి. స్నాప్‌చాట్ సురక్షితంగా ఉండటానికి, వినియోగదారులు పటిష్టమైన భద్రతా పద్ధతులను అమలుచేయోలి. గోప్యతా సెట్టింగ్‌ల విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే, కంటెంట్‌ను షేర్ చేసేటప్పుడు, ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు ఉన్నట్టుగా అనిపిస్తే వెంటనే స్నాప్‌చాట్ సంబంధిత అధికారులకు నివేదించాలి. తరచూ జరిగే నేరాలు ఇది వర్చువల్ దండయాత్రగా చెప్పుకోవచ్చు. స్నాప్‌చాట్ అకౌంట్ హ్యాకింగ్ అనేది ప్రధానంగా ఉన్న సైబర్‌నేరం. దీనివల్ల బాధితులు వివిధ రకాల దోపిడీకి గురవుతారు. హ్యాకర్లు యూజర్ ఖాతాలకు అనధికారక యాక్సెస్‌ను పొందడానికి ఫిషింగ్, కీ లాగింగ్ లేదా బ్రూట్ ఫోర్స్ దాడులు వంటి అనేక రకాల టెక్నాలజీలను ఉయోగిస్తారు. ఒకసారి రాజీ పడితే హ్యాకర్లు వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయవచ్చు. హానికరమైన సందేశాలను పంపవచ్చు. లేదా తదుపరి నేరాలకు పాల్పడేందుకు యూజర్లా నటించవచ్చు. సెక్స్టార్షన్ అనేది ఇందులో మరింత ఆందోళన కలిగించే అంశం. సైబర్ నేరగాళ్లు అభ్యంతరకరమైన కంటెంట్‌ను పంపేలా బలవంతం చేయడం ద్వారా బాధితుల నమ్మకాన్ని దోపిడీ చేస్తారు. ఇక్కడ నుంచి తరచుగా ఆర్థికపరమైన డిమాండ్లను నెరవేర్చకపోతే విషయాన్ని బహిరంగంగా విడుదల చేస్తామని లేదా బాధితుడి పరిచయాలకు షేర్ చేస్తామని బెదిరిస్తారు. దీంతో బాధితులు తీవ్ర ఒత్తిడితో కూడిన పరిణామాలను ఎదుర్కొంటారు. స్నాప్‌చాట్ మెసేజ్‌ల ద్వారా సైబర్ బెదిరింపుల నుంచి విముక్తి లభించదు. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వేధించే, బెదిరించే లేదా ద్వేషపూరిత కంటెంట్‌ను వ్యాప్తి చేసే హానికరమైన వినియోగదారులకు ఈ ప్లాట్‌ఫారమ్ బ్రీడింగ్ గ్రౌండ్‌గా పనిచేస్తుంది. స్నాప్‌చాట్ సైబర్ బెదిరింపు తీవ్రమైన వనసిక క్షోభకు దారి తీస్తుంది. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. వ్యక్తుల నకిలీ ప్రొఫైల్స్ సృష్టించడానికి స్నాప్‌చాట్ సులువుగా అనుమతిస్తుంది. దీనిని సాధారణంగా క్యాట్‌ఫిషింగ్ అని పిలుస్తారు. ఈ మోసగాళ్లు యూజర్లను తప్పుడు సంబంధాలు లేదా స్నేహాలలోకి ఆకర్షిస్తారు. కల్పిత కథలు, దొంగిలించిన చిత్రాలతో మోసగిస్తారు. ఈ విధానాల వల్ల తీవ్ర ఒత్తిడితో అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ∙స్నాప్‌చాట్ మెసేజ్‌లు వెంటనే అదృశ్యమై, అభద్రతా భావాన్ని సృష్టించగలదు. ఈ విషయంలో యూజర్లు జాగ్రత్త వహించాలి. స్క్రీన్షాట్లు, అనధికారిక అప్లికేషన్లు, వ్యక్తిగత కంటెంట్‌ను క్యాప్చర్ చేయగలవు. ఒకసారి లీక్ అయితే, ఆ వ్యక్తి ప్రతిష్టకు తన వ్యక్తిగత జీవితానికి కోలుకోలేని నష్టం కలిగిస్తుంది. కొన్ని భద్రతా చిట్కాలు ∙మీ కంఫర్ట్ లెవల్‌కు అనుగుణంగా ఉండే సెట్టింగ్‌లను ఎంచుకోండి. నమ్మదగిన స్నేహితులకు మాత్రమే యాక్సెస్‌ని పరిమితం చేయండి. నిజజీవితంలో మీకు తెలిసిన, విశ్వసించే వ్యక్తులను మాత్రమే అనుమతించండి. హాని కలిగించే అపరిచితుల రిక్వెస్ట్‌ను యాడ్ చేయడం మానుకోండి. లైంగికపరమైన కంటెంట్‌ను షేర్ చేయడాన్ని నివారించండి. ∙మీ సమాచారాన్ని ఇతరులు దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున మీ పూర్తి పేరు, చిరునావ, ఫోన్ నంబర్ లేదా ఆర్థిక వివరాలను స్నాప్‌చాట్‌లో షేర్ చేయవద్దు. స్నాప్‌చాట్ నుండి ఎవరినైనా కలవాలని నిర్ణయించుకుంటే పబ్లిక్ లొకేషన్‌ను మాత్రమే ఎంచుకోండి. ∙తెలియని షార్ట్ లింక్‌లపై క్లిక్ చేయడం లేదా అనుచిత మెసేజ్‌లకు ప్రతిస్పందిస్త వ్యక్తిగత సవచారాన్ని అందించడం మానుకోండి. స్నాప్ చాట్ లేదా చట్టబద్ధమైన కంపెనీలు... యాప్ ద్వారా మీ లాగిన్ ఆధారాలను లేదా వ్యక్తిగత వివరాలను ఎన్నటికీ అడగవు. స్నాప్‌చాట్ రీసెంట్ అప్డేట్స్ను ఇన్స్టాల్ చేయండి. దీని ద్వారా దోపిడీ ప్రమాదాన్ని నివారించవచ్చు. స్నాప్ మ్యాప్ ఫీచర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇది మీరున్న ప్లేస్‌ను అకౌంట్లోని స్నేహితులకు చపుతుంది. అందుకుని మ్యాప్ ఫీచర్‌ను స్టాప్ చేయండి. స్పాప్‌చాట్ ద్వారా సైబర్‌నేరానికి గురైతే వెంటనే.. https://help.snapchat.com/hc/en-us/articles/7012399221652-How-to-Report-Abuse-on-Snapchat పోర్ట్ చేయాలి. అదేవిధంగా, సమస్య పరిష్కారానికిhttps://www.cybercrime.gov.inలో రిపోర్ట్ చేయాలి. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌఫౌండేషన్ (చదవండి: ఓ నది హఠాత్తుగా నీలం, నారింజ రంగులో మారిపోయింది! ఎక్కడంటే) -
బాలికతో షేర్‌చాట్.. విజయవాడకు వచ్చి..!
తాడేపల్లిరూరల్: పదిహేను రోజుల క్రితం ఒక బాలిక (14) అనంతపురంలో నివసించే ఓ యువకుడికి షేర్‌చాట్‌లో మెసేజ్ పంపించింది. అప్పటినుంచి బాలికతో ఆ యువకుడు షేర్‌చాట్‌లో మెసేజ్ చేస్తున్నాడు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రమణపల్లికి చెందిన ఎం.విజయకుమార్ ఉండవల్లి గ్రామానికి చెందిన ఓ బాలిక గత 15 రోజులుగా ప్రతిరోజూ షేర్‌చాట్‌లో మెసేజ్‌లు చేసుకుంటున్నారు. తనను ఇంట్లోంచి తీసుకువెళ్లిపోమని, లేదంటే చనిపోతానని మెసేజ్ పెట్టడంతో విజయకుమార్, అతని సోదరుడు నవీన్ ఆదివారం అనంతపురం నుంచి బయల్దేరి సోమవారం విజయవాడలోని ఓ హోటల్‌కు వచ్చారు. విషయాన్ని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, బంధువులు హోటల్‌కు వెళ్లి యువకులను పట్టుకుని తాడేపల్లి పోలీసులకు అప్పగించారు. మెసేజ్ చేసింది బాలిక అనుకోలేదని, తాను డిగ్రీ పూర్తి చేశానని ఆమె తనతో చెప్పిందని విజయకుమార్ పోలీసులకు చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పేటీఎం నుంచి మెసేజింగ్ సేవలు!!
న్యూఢిల్లీ: వాట్సాప్‌కు పేటీఎం పోటీగా రాబోతోందా? ఇది మెసేజింగ్ సర్వీసులను ప్రారంభించటానికి సర్వం సిద్ధం చేసుకుంటోందా? అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. పేటీఎం ఈ నెలాఖరు నాటికి మెసేజింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. పేటీఎం తన ప్లాట్‌ఫామ్‌కు కొత్త ఫీచర్‌ను జోడించనుందని, దీని ద్వారా యూజర్లు చాట్ చేసుకోవచ్చని, అలాగే ఆడియో, వీడియో, ఫోటోలను షేర్ చేసుకోవచ్చని ఈ వ్యవహారంతో సంబంధమున్న కొందరు తెలియజేశారు. అయితే దీనిపై స్పందించడానికి పేటీఎం అధికార ప్రతినిధి నిరాకరించారు. కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తే పేటీఎం యూజర్ల సంఖ్య మరింత పెరుగుతుందని వీరు ధీమా వ్యక్తంచేశారు. వాట్సాప్ డిజిటల్ పేమెంట్స్ విభాగంలోకి అడుగుపెట్టాలని భావిస్తోన్న తరుణంలో పేటీఎం మెసేజింగ్ సేవలను అందించడానికి ప్రయత్నించడం ఆసక్తికరమైన పరిణామం. కాగా భారత్‌లో వాట్సాప్‌కు 2017 ఫిబ్రవరి నాటికి 20 కోట్లకుపైగా మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉంటే.. పేటీఎంకు 23 కోట్లకుపైగా యూజర్లున్నారు. -
మెసేజింగ్ ప్లాట్ఫామ్లో తాన్లా రికార్డు
హైదరాబాద్: తాన్లా సొల్యూషన్స్‌కు చెందిన ఏ2పీ (అప్లికేషన్ టూ పర్సన్) మెస్సేజింగ్ హబ్ ‘ఫాస్ట్‌ట్రాక్’ అక్టోబర్‌లో 500 కోట్ల మెసేజ్‌లను ప్రాసెస్ చేసింది. ఒకేరోజు 20 కోట్లకుపైగా మెసేజ్‌లను ప్రాసెస్ చేసి రికార్డు సృష్టించింది. మెసేజింగ్ ప్లాట్ఫామ్లో ఇది ప్రపంచంలోనే ఒక రికార్డని తాన్లా సొల్యూషన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. త్వరితగతిన మెస్సేజ్ ప్రాసెసింగ్, వన్ టైమ్ పాస్వర్డ్స్ వంటి కీలక మెసేజ్‌ల విషయంలో లావాదేవీ, భద్రత, డెలివరీ అలర్ట్స్ వంటివి బ్యాంకులకు, ఈ కామర్స్‌కు, రవాణా, సరఫరాల వ్యవస్థ, సోషల్ మీడియాలకు ఎంతో కీలకమని సంస్థ పేర్కొంది. ఆయా అంశాల్లో తమ సామర్థ్యాన్ని మెసేజింగ్ హబ్ తెలియచెబుతున్నట్లు ఒక ప్రకటనలో తాన్లా సొల్యూషన్స్ సీఈఓ ఉదయ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత విప్లవాత్మక సాంకేతిక వ్యవస్థలో అప్లికేషన్ టూ పర్సన్ విభాగం కీలకమని ఆయన వివరిస్తూ... ఈ రంగం భవిష్యత్తులో మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. 2018 నాటికి ఏ2పీ మెసేజింగ్‌కు సంబంధించి మార్కెట్ విలువ ప్రపంచవ్యాప్తంగా 60 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. 1999లో స్థాపించిన తాన్లా సొల్యూషన్స్‌లో 300కుపైగా టెలికం నిపుణులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎన్ఎస్ఈలో గురువారం సంస్థ షేర్ ధర క్రితంతో పోల్చితే 5.66 శాతం పెరిగి (రూ.2.20) రూ.41.10 వద్దకు ఎగసింది.