టాటా సఫారి స్టార్మ్ ఆన్‌లైన్ బ్రాండ్ స్టోర్ | Tata Safari Storm to start online brand store | Sakshi
Sakshi News home page

టాటా సఫారి స్టార్మ్ ఆన్‌లైన్ బ్రాండ్ స్టోర్

Published Wed, Jun 11 2014 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 AM

టాటా సఫారి స్టార్మ్ ఆన్‌లైన్ బ్రాండ్ స్టోర్

టాటా సఫారి స్టార్మ్ ఆన్‌లైన్ బ్రాండ్ స్టోర్

హైదరాబాద్: టాటా మోటార్స్, ఈబే ఇండియాలు కలిసి టాటా సఫారి స్టార్మ్ ఆన్‌లైన్ బ్రాండ్ స్టోర్‌ను ఏర్పాటు చేశాయి. దీంతో దేశవ్యాప్తంగా వినియోగదారులు టాటా సఫారి మర్కండైజ్(లెదర్ కీ-చెయిన్స్, ట్రెక్కింగ్ బ్యాగ్‌లు, టి-షర్ట్స్, క్యాంపింగ్ స్విస్ నైవ్స్, మ్యాగ్నెటిక్ కంపాస్... మొదలైన  వస్తువుల)ను ఈబే ఇండియాలో కొనుగోలు చేయవచ్చని ఈబే ఇండియా హెడ్ (స్ట్రాటజీ) రతుల్ ఘోష్ ఒక ప్రకటనలో తెలిపారు.
 
టాటా నానో బ్రాండ్ స్టోర్ విజయవంతం కావడంతో ఆ బాటలోనే సఫారి స్టార్మ్ ఆన్‌లైన్ బ్రాండ్‌స్టోర్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. టాటా సఫారి మర్కండైజ్‌ను ఈ ఆన్‌లైన్ బ్రాండ్ స్టోర్ ద్వారా అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని టాటా మోటార్స్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ హెడ్(ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్) డెల్‌నా అవ్రి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement