ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ల జోరును అద్దంపడుతూ ఓవైపు సెన్సెక్స్ 23,000 పాయింట్లకు చేరువవుతుంటే... మరోపక్క 17 దేశీ కార్పొరేట్ గ్రూపులు అంతకుమించిన జోష్‌తో రూ. లక్ష కోట్ల మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్)ను అందుకోవడం విశేషం. టాటా గ్రూప్ రూ. 7 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో అగ్రస్థానంలో నిలిచింది. వెరసి ఈ జాబితాలోని 17 బిజినెస్ గ్రూపుల మొత్తం విలువ రూ. 35 లక్షల కోట్లకు చేరడం మరో విశేషం! అంటే ఇది దేశీ స్టాక్ మార్కెట్ల విలువ రూ. 75 లక్షల కోట్లలో దాదాపు సగం!
రెండు గ్రూపులు కలిపినా తక్కువే
జాబితాలో 2,3 స్థానాల్లో నిలిచిన హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్, ముకేశ్ అంబానీ ఆర్‌ఐఎల్ గ్రూప్‌ల సంయుక్త విలువ కంటే టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్ అధికం కావడం చెప్పుకోదగ్గ అంశం. 30కుపైగా లిస్టెడ్ కంపెనీలున్న టాటా గ్రూప్‌నకు ప్రధానంగా టీసీఎస్ నుంచి రూ. 4.3 లక్షల కోట్లు సమకూరాయి. కాగా, రూ. 3.2 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ రెండో స్థానంలో నిలవగా, రూ. 3.07 లక్షల కోట్ల విలువతో ఆర్‌ఐఎల్ 3వ స్థానాన్ని పొందింది. ఈ బాటలో ఐటీసీ(రూ. 2.7 లక్షల కోట్లు), ఇన్ఫోసిస్(రూ. 1.8 లక్షల కోట్లు)తోపాటు, వేదాంతా, భారతీ, ఆదిత్య బిర్లా, సన్ ఫార్మా, ఐసీఐసీఐ, ఎల్‌అండ్‌టీ, మహీంద్రా, విప్రో, హెచ్‌యూఎల్, అదానీ, హెచ్‌సీఎల్, బజాజ్ గ్రూప్ సైతం లక్ష కోట్ల మార్కెట్ క్యాప్ జాబితాలో నిలిచాయి.
కార్పొరేట్ల మార్కెట్ క్యాప్‌లో టాటా టాప్
Published Mon, Apr 28 2014 12:52 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM
Advertisement