సీనియర్ సిటిజన్లుంటే పన్ను ఆదానే..!
ఆదాయ పన్ను చట్టం సీనియర్ సిటిజన్ల వయసును, సంపాదించే పరిస్థితి తగ్గిపోవటాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రారుుతీలిచ్చిం ది. వీరిని 2 రకాలుగా చూడొచ్చు. 60 సంవత్సరాలు దాటి.. 80 ఏళ్లలోపు వారు ఒక రకం. వీరిని సిటిజన్లు అని పిలుస్తున్నాం. ఇక 80 ఏళ్లు దాటిన వారు సూపర్ సిటిజన్లు. ఇక్కడ లింగ బేధం లేదు. అలాగే రెసిడెంట్లకే ఈ వెసులుబాట్లు వర్తిస్తారుు.
సీనియర్ సిటిజన్లు
⇔ 2016-17 ఆర్థిక సంవత్సరంలో 60 సంవత్సరాలు పూర్తి అవ్వాలి. 60లో అడుగుపెట్టడం కాదు. 60 సంవత్సరాలు నిండి ఉండాలి.
⇔ వీరికి సంవత్సరపు నికర ఆదాయం/ట్యాక్సబుల్ ఇన్‌కమ్ రూ.3లక్షల వరకు మినహారుుంపు ఉంది.
⇔ మిగతా వారు అంటే.. 60 సంవత్సరాల లోపల వారికి మినహారుుంపు రూ.2,50,000గా ఉంది. అంటే సిటిజన్లకు అదనంగా రూ.50,000 పన్ను మినహారుుంపు ఉంది.
⇔ రిటర్నులు ఈ-ఫైలింగ్ ద్వారా వేయాలి. నికర ఆదాయం రూ.5,00,000 దాటకపోతే కౌంటర్‌లో దాఖలు చేయవచ్చు.
⇔ వీరి ఆదాయంలో వ్యాపారం/వృత్తి మీద రాబడి లేకపోతే అడ్వాన్‌స ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.
⇔ 80డి కింద పొందే ప్రయోజనాలన్నింటితోపాటు అదనంగా రూ.5,000 మేర ప్రయోజనం పొందొచ్చు. ఇది మెడిక్లెరుుమ్.
⇔ 80డిడిబి కింద వైద్య చికిత్సకి మినహారుుంపులు ఉన్నారుు.
⇔ ఫారం 15 హెచ్ అందజేస్తే బ్యాంకు వారు మీకొచ్చే వడ్డీ ఆదాయంలో పన్నుకోత (టీడీఎస్) చేయరు.
సూపర్ సీనియర్ సిటిజన్లు
⇔ 2016-17 ఆర్థిక సంవత్సరంలో 80 ఏళ్లు పూర్తి అవ్వాలి. 80లోకి అడుగుపెట్టడం కాదు.
⇔ ఈ వర్గం వారికి నికర ఆదాయం/ట్యాక్సబుల్ ఇన్‌కమ్ రూ.5,00,000. పన్ను భారం లేదు. ఇది పెద్ద ఉపశమనం. దీని వల్ల రూ.2,50,000 పన్ను భారం తగ్గుతుంది.
⇔ రిటర్నులు, ఈ-ఫైలింగ్ తప్పనిసరి కాదు.
⇔ ఐటీఆర్-1, 2, 2ఏ దాఖలు చేసేవారు కౌంటర్‌లో (మాన్యువల్‌గా) దాఖలు చేయవచ్చు. డిజిటల్ సంతకం అక్కర్లేదు. ఈ-ఫైలింగ్‌తో పని లేదు.
⇔ వీరికి కూడా వ్యాపారం/వృత్తి మీద ఆదాయం లేకపోతే ముందుగా అడ్వాన్‌స ట్యాక్స్ చెల్లించనవసరం లేదు.
⇔ సెక్షన్ 80 డి ప్రకారం.. మెడిక్లెరుుమ్ అదనంగా రూ.5,000 మేర క్లెరుుమ్ చేసుకోవచ్చు.
⇔ అలాగే వైద్య చికిత్సల నిమిత్తం అదనంగా రూ.20,000లు మినహారుుంపు పొందొచ్చు.
⇔ ఫారమ్ 15 హెచ్‌తోబ్యాంకులు టీడీఎస్ చేయరు.
⇔ ఇవన్నీ కాకుండా ట్యాక్స్‌ప్లానింగ్‌లో సీనియర్ సిటిజన్ల ప్రమేయం ఎంతో ఫలితాన్నిస్తుంది. ఇంట్లో సీనియర్ సిటిజన్లు ఉంటే వారి రాయితీల వల్ల ప్రతి ఒక్కరూ ఏదో వ్యాపారం చేయవచ్చు.