హైదరాబాద్ : ఆభరణాల విక్రయ సంస్థత్రిభువన్‌దాస్ భీమ్‌జీ జవేరి(టీబీజడ్) ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో రూ.2.72 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ1లో ఆర్జించిన నికర లాభం(రూ.52 లక్షలు)తో పోల్చితే 420 శాతం వృద్ధిని సాధించామని టీబీజడ్ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.432 కోట్ల నుంచి 3 శాతం క్షీణించి రూ.416 కోట్లకు తగ్గిందని కంపెనీ సీఎండీ శ్రీకాంత్ జవేరి పేర్కొన్నారు. ఇబిటా 13 శాతం వృద్ధితో రూ.17 కోట్లకు పెరిగిందని, ఇబిటా మార్జిన్లు 4 శాతం వృద్ధి చెందాయని వివరించారు. వినియోగదారుల అభిరుచులకనుగుణంగా వినూత్నమైన డిజైన్లలో స్వర్ణ, వజ్రాభరణాలను అందిస్తున్నామని పేర్కొన్నారు.