ట్విట్టర్ లోనూ టెలికం, తపాలా ఫిర్యాదులు..
కొత్త సర్వీసు ప్రారంభించిన కేంద్రం
న్యూఢిల్లీ: వినియోగదారులు టెలికం, తపాలా సేవలకు సంబంధించిన ఫిర్యాదులను ఇక నుంచి సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా ప్రభుత్వానికి నేరుగా తెలియజేయవచ్చు. దీని కోసం టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా తాజాగా ‘ట్విట్టర్ సేవ’ అనే కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. దీని ద్వారా కస్టమర్లు వారి టెలికం, తపాలా సంబంధిత ఫిర్యాదులను కేంద్రానికి పంపొచ్చు. ప్రభుత్వం త్వరితగతిన వాటిని పరిష్కరిస్తుంది.
ట్విట్టర్ సేవ ద్వారా వచ్చిన ఫిర్యాదులను మంత్రిత్వ శాఖ అధికారులు మూడు విభాగాలుగా (తక్షణం, మధ్యస్థం, దీర్ఘకాలం) విభజించి వాటిని ఆయా సంబంధిత అధికారులకు బదిలీ చేస్తారని, అక్కడ వాటి పరిష్కారం జరుగుతుందని సిన్హా వివరించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ సహా ఏ టెలికం ఆపరేటర్‌పైనైనా వచ్చే ఫిర్యాదులనైనా స్వీకరిస్తామని తెలిపారు. ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే వారి ట్వీటర్ అకౌంట్ ద్వారా సంబంధిత సమస్యను ‘ఃఝ్చ్జౌటజీజ్చిఛ్జఞ’ ట్వీటర్‌కి ట్వీట్ చెయొచ్చు. లేదా ట్వీటర్ యూజర్లు డాట్‌సేవ, బీఎస్‌ఎన్‌ఎల్‌సేవ, ఎంటీఎన్‌ఎల్‌సేవ, పోస్టల్ సేవ వంటి హాష్‌ట్యాగ్స్‌తో వారి ఫోన్ నంబర్‌తోపాటు సంబంధిత సమస్యను ట్వీట్ చేయొచ్చు.