టెలికాంలో భారీగా ఉద్యోగాల కోత
తీవ్రమైన పోటీ నెలకొనడంతో టెలికాం సెక్టార్ గతేడాది 10వేల ఉద్యోగాలను తీసివేయాల్సి వచ్చిందని ఆర్ కామ్ చెప్పింది. ఈ పోటీ మరింత పెరిగే అవకాశముందని రేటింగ్ ఏజెన్సీలు అంచనావేస్తున్నాయని, దీంతో ఈ ఏడాది కూడా 40వేల కంటే ఎక్కువగా ఉద్యోగాల కోత ఉంటుందని పేర్కొంది. భారీ రుణభారంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ కూరుకుపోయిందనే ఆందోళన నేపథ్యంలో ఆర్ కామ్ నేడు ఓ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కంపెనీ రుణ భారం తగ్గించుకునేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నామని చెప్పింది.
పన్నులతో టెలికాం సెక్టార్ తీవ్రభారాన్ని భరించాల్సి వస్తుందని, దీంతో ఈ రంగ రుణాలు రూ.2.8 లక్షల కోట్లకు పెరిగినట్టు వివరించింది. ప్రస్తుతమున్న పన్ను రేట్లను మరింత పెంచుతూ టెలికాం రంగాన్ని 18 శాత పన్నుశ్లాబులోకి తీసుకురావడంపై ఆందోళనవ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం టెలికాం రంగానికి మూడేళ్ల మానిటోరియం అందించాలని కోరింది. డేటా రేట్లు కూడా భారీగా దిగిరావడంతో రెవెన్యూలు కోల్పోతున్నామని చెప్పింది. కంపెనీ పురోగతిపై నెలాఖరున జరుగబోయే వచ్చే మీటింగ్ లో వివరించనున్నామని పేర్కొంది..