విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సుమన్ రెడ్డి, శాంతను పాల్ (ఎడమ నుంచి కుడికి))
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కోసం పెగా సిస్టమ్స్, టాలెంట్ స్ప్రింట్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు యూనివర్సిటీ అకాడమిక్ ప్రొగ్రాం (యూఏపీ)ను ప్రారంభిస్తున్నట్లు పెగా సిస్టమ్స్ ఇండియా ఎండీ సుమన్ రెడ్డి, టాలెంట్ స్ప్రింట్ కో-ఫౌండర్ అండ్ సీఈఓ శాంతను పాల్ చెప్పారు. శిక్షణ కోసం ప్రస్తుతానికైతే దేశంలోని 8 వర్సిటీలతో ఈ ఒప్పందం చేసుకున్నామని.. హైదరాబాద్ నుంచి వాసవి, సీబీఐటీ కళాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ శిక్షణ రెండు సెమిస్టర్లుంటుందని.. ఒక్కో సెమ్‌కు రూ.7,500 ఫీజుంటుందని తెలిపారు. శిక్షణానంతరం సర్టిఫికెట్‌ను ప్రదానం చేస్తామన్నారు. త్వరలోనే ఇంజనీరింగ్‌తో పాటూ ఇతర విభాగాల విద్యార్థులకూ శిక్షణ ఇస్తామని చెప్పారు.