
ట్విట్టర్ సంచలన నిర్ణయం
మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ వినియోగదారులు ప్రత్యక్ష సందేశాలను (డీఎం), ప్రముఖుల ఖాతాలను అనుసరించడానికి, వారి ట్వీట్లను ఫాలో అవ్వడానికి , సిఫార్సులను పంపడానికి ఉపయోగడే ప్రభావవంతమైన బాట్ 'మ్యాజిక్ రెక్స్ 'కి గుడ్ బైచెప్పింది.
మైక్రోబ్లాగింగ్ సైట్ డైరెక్ట్ మెసేజ్ బాట్ విధానానికి స్వస్తి పలుకుతూ సంచలనం నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు ప్రత్యక్ష సందేశాలను (డీఎం), ప్రముఖుల ఖాతాలను అనుసరించడానికి, వారి ట్వీట్లను ఫాలో అవ్వడానికి, సిఫార్సులను పంపడానికి ఉపయోగడే ప్రభావవంతమైన బాట్ 'మ్యాజిక్ రెక్స్'కి గుడ్ బై చెప్పింది. ఈమధ్యే ట్విట్టర్ ద్వారా మెసేజ్ చేసే పదాల సంఖ్య పెంచిన ట్విట్టర్, హోంపేజిలోని డైరెక్ట్ మెసేజ్ సర్వీస్ 'మ్యాజిక్ రెక్స్ సర్వీస్' నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది. స్నేహితులకు, ఫాలోవర్స్‌కు వ్యక్తిగత సందేశాలను ట్వీట్ చేసేందుకు కల్పించిన డైరెక్ట్ మెసేజ్ (డీఎం) సర్వీస్‌లకు వీడ్కోలు పలికింది.
2013లో లాంచ్ చేసిన మ్యాజిక్ రెక్స్‌కి గుడ్ బై చెప్పినట్టు వెల్లడించింది. అయితే పుష్ నోటిఫికేషన్స్ సదుపాయం మాత్రం అందుబాటులో ఉంటుందని పేర్కొంది. గతంలో మ్యాజిక్ రిక్స్ నుంచి డైరెక్ట్ మెసేజ్ ద్వారా పంపిన సందేశాలను ఇక మీదట పుష్ నోటిఫికేషన్ ద్వారా పంపుకోవచ్చని ట్విట్టర్ ప్రతినిధి తెలిపారు. కొత్త ఆల్గరిథమ్‌తో ప్రముఖుల ఖాతాలు కనిపించే విధానం తీసుకురావడంతో పాటు డైరెక్ట్ మెసేజ్ సర్వీస్‌లో అక్షరాల పరిమితి వల్ల ఇబ్బందిని గుర్తించామంటూ అక్షరాల పరిమితిని ఈ ఏడాదే గణనీయంగా పెంచిన ట్విట్టర్ డైరెక్ట్ మెసేజ్ బాట్ కు వీడ్కోలు చెప్పడం సంచలనంగా మారింది. ఇటీవల సీఈవో జాక్ డోర్సే మాట్లాడుతూ వినియోగదారులను మరింత చేరువ కాడానికి ప్రయత్నిస్తున్నట్టు పాత, కొత్త యూజర్లను ఆకర్షించేందుకు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. 2015 మూడో త్రైమాసికంలో కొత్త యూజర్లను ఆకర్షించడంలోవిఫలమై, అంచనాలకు మించి చతికిలబడ్డ ఈ సంస్థ తాజా నిర్ణయంతో మరిన్ని కష్టాలను కోరి తెచ్చుకుంటోందా.. వేచి చూడాలి