
వ్యవసాయ సంబంధిత యంత్రాల తయారీ కంపెనీ ఎస్కార్ట్స్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్‌లో రెండు రెట్లు పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2016–17) క్యూ4లో రూ.59 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.113 కోట్లకు పెరిగిందని ఎస్కార్ట్స్ తెలిపింది.
ఆదాయం రూ.1,044 కోట్ల నుంచి 41% వృద్ధితో రూ.1,436 కోట్లకు పెరిగిందని తెలిపారు. రూ.10 ముఖ విలువ గల షేర్‌కు రూ.2 డివిడెండ్ ఇవ్వనున్నామని తెలిపింది. ఇక 2016–17లో రూ.131 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రెండు రెట్లకు మించి రూ.347 కోట్లకు పెరిగిందని నందా తెలిపారు. ఆదాయం రూ.4,220 కోట్ల నుంచి రూ.5,080 కోట్లకు ఎగసిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment