బ్యాలెన్స్ అయిపోతే రూ.5 లోన్: టెలినార్ | Uninor starts offering Rs.5 loan talktime on PAN India basis | Sakshi
Sakshi News home page

బ్యాలెన్స్ అయిపోతే రూ.5 లోన్: టెలినార్

Published Tue, Jun 14 2016 1:30 AM | Last Updated on Mon, Sep 4 2017 2:23 AM

బ్యాలెన్స్ అయిపోతే రూ.5 లోన్: టెలినార్

బ్యాలెన్స్ అయిపోతే రూ.5 లోన్: టెలినార్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ టెలినార్ తత్కాల్ క్రెడిట్ పేరుతో కొత్త రిచార్జ్ ప్యాక్‌ను ప్రకటించింది. ఫోన్ బ్యాలెన్స్ రూ.1.50 లోపుకు చేరితే రూ.5 లోన్ పొందవచ్చు. ఈ మొత్తంతో 10 నిముషాల లోకల్/ఎస్టీడీ కాల్స్ లేదా 20 ఎంబీ డేటా వాడుకోవచ్చు. బ్యాలెన్స్ తగ్గిన సమయంలో మొబైల్ తెరపై ఫ్లాష్ మెసేజ్ వస్తుంది. తత్కాల్ క్రెడిట్ కావాల్సిన కస్టమర్ స్టార్141హాష్ టైప్ చేయాలి. లోన్ తీసుకున్నందుకుగాను తదుపరి రిచార్జ్ నుంచి రూ.5తోపాటు లావాదేవీ రుసుము కింద రూ.1 తగ్గిస్తారు. రోజులో ఎన్నిసార్లయినా లోన్ తీసుకోవచ్చని టెలినార్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కొటియన్ సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement