
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌లో టెలినార్ విలీన ప్రతిపాదనకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదముద్ర వేసింది. ఇందుకు సంబంధించిన విలీన పథకానికి కొన్ని షరతులతో అనుమతినిచ్చింది. ఇప్పటికే ఈ ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, స్టాక్ ఎక్సే్చంజీలు బీఎస్‌ఈ.. ఎన్‌ఎస్‌ఈల నుంచి అనుమతులు దక్కగా .. టెలికం శాఖ నుంచి ఆమోద ముద్ర లభించాల్సి ఉంది.
గతేడాది ఫిబ్రవరిలో రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ సహా ఏడు సర్కిల్స్‌లో టెలినార్ ఇండియా కార్యకలాపాలను ఎయిర్‌టెల్ కొనుగోలు చేస్తుంది. దీంతో టెలినార్ ఇండియా ఆస్తులు, యూజర్లు అంతా ఎయిర్‌టెల్ ఖాతాలోకి చేరతారు.
Comments
Please login to add a commentAdd a comment