డాలర్ మారకంలో రూపాయి మారకం విలువ పటిష్టత కొనసాగుతోంది. శుక్రవారం ఫారెక్స్ మార్కెట్‌లో ఒకేరోజు 24 పైసలు బలపడి, 64.28 వద్ద ముగిసింది.
డాలర్ మారకంలో రూపాయి మారకం విలువ పటిష్టత కొనసాగుతోంది. శుక్రవారం ఫారెక్స్ మార్కెట్‌లో ఒకేరోజు 24 పైసలు బలపడి, 64.28 వద్ద ముగిసింది. ఇది 20 నెలల గరిష్ట స్థాయి. ఈ ఏడాది డాలర్ మారకంలో 68.881కు చేరిన రూపాయి, గత నెల ప్రారంభం నుంచీ అప్రతిహతంగా, అంచనాలకు భిన్నంగా భారీగా బలపడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా మూడు రోజుల్లో డాలర్ మారకంలో రూపాయి 75పైసలు లాభపడింది.