మాల్యా, యూఎస్ఎల్ డీల్ పై సెబీ దృష్టి
న్యూఢిల్లీ: సంస్థ నుంచి నిష్ర్కమించినందుకు గాను మాజీ చైర్మన్ విజయ్ మాల్యాకు యునెటైడ్ స్పిరిట్స్ (యూఎస్‌ఎల్) రూ. 515 కోట్లు చెల్లించే ప్రతిపాదనపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. ఈ డీల్ విషయంలో కార్పొరేట్ గవర్నెన్స్, ఇతర నిబంధనల ఉల్లంఘన జరిగిందా అన్న కోణంలో పరిశీలన చేపట్టింది. ఇందులో యునెటైడ్ స్పిరిట్స్, దాని ప్రమోటర్ డయాజియోతో పాటు మాల్యా, ఆయనకి చెందిన యూబీ గ్రూప్ సంస్థల ప్రమేయాన్ని కూడా పరిశీలిస్తోన్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.