లిక్కర్ కింగ్ మాల్యాపై నిషేధం
లిక్కర్ కింగ్ మాల్యాపై నిషేధం
Published Wed, Jan 25 2017 8:21 PM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM
ముంబై : బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి తప్పించుకుని తిరుగుతున్న విజయమాల్యాకు మరో షాక్ ఎదురుకాబోతుంది. దేశీయ క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటరీ సెబీ ఆయనపై నిషేధం విధించేందుకు సిద్దమవుతోంది. సెక్యురిటీస్ మార్కెట్ నుంచి ఆయన్ను తొలగించాలని సెబీ నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ విషయంపై సెక్యురిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా త్వరలోనే మధ్యంతర ఉత్వర్వులు జారీచేయనుందని తెలుస్తోంది.
మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు రెగ్యులేటరి విచారణలో తెలవడంతో ఈ కఠిన నిర్ణయానికి సెబీ మొగ్గుచూపింది. బ్యాంకులకు విజయ్ మాల్యా దాదాపు రూ. 9వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి యూకేకు పారిపోయిన సంగతి తెలిసిందే. వ్యాపారవేత్త విజయ్ మాల్యా రుణాల ఎగవేత కేసుకు సంబంధించి ఎనిమిది మందిని సీబీఐ సోమవారం అరెస్ట్ చేసింది. ఇందులో ఐడీబీఐ బ్యాంక్ మాజీ చైర్మన్ యోగేశ్ అగర్వాల్ కూడా ఉన్నారు.
Advertisement