మీరు ముందే కొంత స్థిర మొత్తాన్ని ఒక ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌కు చెల్లిస్తారు. అది తర్వాత మీరు చెల్లించిన మొత్తాన్ని, దానికి వడ్డీని కలిపి మీకు తిరిగి రెగ్యులర్‌గా చెల్లిస్తుంది. ఉదాహరణకు మీరు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద యాన్యుటీ ప్లాన్ తీసుకున్నారు. ప్లాన్‌లో భాగంగా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మీకు క్రమం తప్పకుండా నిర్ణీత కాలాల్లో (నెలవారీగా, త్రైమాసికం చొప్పున, ఆరు నెలలకు, ఇలా..) కొంత మొత్తాన్ని తిరిగి వెనక్కు చెల్లిస్తుంది.
ఇందులో చాలానే ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు మీ యాన్యుటీని వెంటనే లేదా మీకు నచ్చిన సమయం నుంచి పొందొచ్చు. సాధారణంగా రిటైర్మెంట్ సమయంలో స్థిర ఆదాయం కోసం ఈ యాన్యుటీ ప్లాన్స్ ఉపయోగకరంగా ఉంటాయి. ఇక పెన్షన్ అనేది ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత పొందే మొత్తం అని చెప్పొచ్చు. పెన్షన్ ప్రధానంగా వేతనం, ఈపీఎఫ్, ఈపీఎస్ కంట్రిబ్యూషన్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment