29 నుంచి విప్రో షేర్ల బైబ్యాక్‌ | Wipro shares buyback from 29th | Sakshi
Sakshi News home page

29 నుంచి విప్రో షేర్ల బైబ్యాక్‌

Published Tue, Nov 21 2017 12:57 AM | Last Updated on Tue, Nov 21 2017 12:57 AM

Wipro shares buyback from 29th - Sakshi

న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ విప్రో షేర్ల బైబ్యాక్‌ ఈ నెల 29 నుంచి ప్రారంభమవుతోంది. వచ్చే నెల 13న ముగిసే ఈ బైబ్యాక్‌లో ఒక్కో షేర్‌ను రూ.320 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు విప్రో తెలిపింది. అర్హత గల వాటాదారులు ఈ రోజుల్లో మాత్రమే దరఖాస్తు చేయాలని పేర్కొంది.  ప్రస్తుత ధరతో పోల్చితే 9 శాతం ప్రీమియంతో విప్రో షేర్లను బైబ్యాక్‌  చేస్తోంది.

షేర్ల బై బ్యాక్‌కు ఈ కంపెనీ రూ.11,000 కోట్లు కేటాయించింది.  రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ.320 ధర చొప్పున 7.06% వాటాకు సమానమైన 34.37 కోట్ల షేర్లను కొంటామని  విప్రో ప్రకటించింది. ఈ షేర్ల బైబ్యాక్‌కు రికార్డ్‌ తేదీగా ఈ ఏడాది సెప్టెంబర్‌ 15ను కంపెనీ నిర్ణయించింది. టెండర్‌ ఆఫర్‌ రూట్‌లో బైబ్యాక్‌ చేయనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement