
సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో దిగ్గజ కంపెనీలకు సైతం దడ పుట్టిస్తూ దూసుకుపోతున్న చైనా మొబైల్ మేకర్ ఇపుడు మరో సంచలనానికి నాంది పలికింది. దేశ్ కా స్మార్ట్‌ఫోన్ పేరుతో బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్ రేపు (నవంబరు 30)న విడుదల చేస్తోంది. ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఇది లభ‍్యంకానుంది.
షావోమి వై 1, వై 1 లైట్ స్మార్ట్‌ఫోన్ ల తరువాత వెంటనే లాంచ్ చేస్తున్న ఈ డివైస్‌ను సుమారు రూ. 5,900 లకు విక్రయించనుందని సమాచారం. ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉన్న రెడ్‌మి 5ఏ తరహాలోనే దీని ఫీచర్లు ఉండవచ్చని అంచనా.
5 అంగుళాల డిస్‌ప్లే
1280x720 రిజల్యూషన్
ఆండ్రాయిడ్ నౌగట్
2జీబీ ర్యామ్
16జీబీ స్టోరేజ్
13ఎంపీ ప్రైమరీ కెమెరా
5ఎంపీ ఫ్రంట్ కెమెరా
3000ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment