
సాక్షి, ముంబై: అమెజాన్ ఇండియాలో షావోమి, ఎంఐ 4 సిరీస్ టీవీలు స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు ( 26 సోమవారం) ప్రారంభమైన ఈ సేల్ మే 31వ తేదీవరకు అందుబాటులో ఉంటుంది. షావోమి రెడ్‌మి 6ఏ, రెడ్‌మి 6 ప్రి, రెడ్‌మి వై2, రెడ్‌మి 6, రెడ్‌మి 7 తదితర స్మార్ట్‌ఫోన్లతో పాటు ఎంఐ టీవీలు కూడా రాయితీ ధరల్లో లభించనున్నాయి.
ముఖ్యంగా 10వేల 15వేల రూపాయల మధ్య లభించనున్న స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. అలాగే అమెజాన్ క్యాష్‌బ్యాక్, ఎక్స్చేంజ్, తాత్కాలిక తగ్గింపులాంటి పొందవచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఎంఐ టీవీ 4 సిరీస్ టీవీలపై ఎక్స్చేంజ్, ఆఫర్ అందిస్తోంది. 49, 55, 43 అంగుళాల, ఎంఐ ఆండ్రాయిడ్ టీవీ, ఎల్‌ఈడీ 4ఏ టీవీపై రూ.2260 దాకా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment