యస్‌బ్యాంక్ లాభం 28% అప్
న్యూఢిల్లీ : ప్రైవేట్ రంగంలోని యస్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి 28 శాతం వృద్ధితో రూ.551 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం పెరగడం వల్ల నికర లాభంలో రెండంకెల వృద్ధి నమోదైందని వివరించింది.కాగా ఆదాయం 42 శాతం వృద్ధితో రూ.1,060 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.3,093 కోట్ల నుంచి రూ.3,797 కోట్లకు ఎగసింది. కాగా త్వరలో బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలోకి ప్రవేశించనుంది.