Mutual Fund Business
-
సులభంగా రూ.కోటి సంపాదన!
స్టాక్ మార్కెట్ అంటే తీవ్ర ఒడిదొడుకులు సహజం. ఒక్క రోజులో సెన్సెక్స్, నిఫ్టీ(NIFTY) సూచీలు భారీగా నష్టపోతాయి. మరో రోజు అవి అంతే వేగంతో పైకి దూసుకుపోతాయి. ఇది సహజమే. దీర్ఘకాలిక లక్ష్యాలతో మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి ఇలా సూచీల్లోని ఒడిదొడుకుల ప్రయోజనమే కలిగిస్తాయి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానం (SIP) చేసేవారికి ఇదో మంచి అవకాశంగా భావించాలి. మార్కెట్ ఎటు వైపు పయనిస్తున్నా మదుపు చేస్తూ వెళ్లడమే వీరికి లాభాలు పెరిగేలా చేస్తుంది. అసలు సిప్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.మార్కెట్ భారీగా పెరిగినప్పుడు ఒకేసారి పెద్ద మొత్తం మదుపు చేయడం సరికాదు. అలాగని అలా పెరుగుతూ ఎక్కడి వరకు వెళ్తుందో స్పష్టంగా చెప్పలేం. ఒకవేళ తగ్గితే నష్టపోతామనే భయాలుంటాయి. కానీ సిప్ చేసేవారికి అలాంటి భయాలు ఉండకూడదు. ప్రతినెలా నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం ద్వారా మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి లాభాలు అందుకోవచ్చు. ఇదే సిప్ ఉద్దేశం. కొద్ది మొత్తంతో ప్రారంభించి, ఏటా కొంత శాతం పెంచుకుంటూ వెళ్తే తక్కువ సమయంలోనే పెద్ద మొత్తంలో డబ్బు కూడబెట్టవచ్చు.లక్ష్యంపై స్పష్టతఅసలు ఏ ఇన్వెస్ట్ చేసినా అది మన ఆర్థిక లక్ష్యాలను చేరుకునేలా ఉండాలి. ఏ సమయంలో మనకు ఆ డబ్బు అవసరమో స్పష్టత ఉండాలి. దాన్ని సాధించేందుకు ఏం చేయాలి? అనే స్పష్టమైన ప్రణాళికతోనే సిప్‌ను ప్రారంభించాలి. మీరు ఇప్పుడు పెట్టుబడి పెట్టే లక్ష్యాలు కాలక్రమంలో మారిపోవచ్చు. మరింత అధిక మొత్తంలో డబ్బు అవసరం కావచ్చు. చాలామంది అనేక పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ, కొన్నిసార్లు తమ అవసరానికి సరిపడా డబ్బు అందుకోకపోవచ్చు. కాబట్టి భవిష్యత్తు ప్రణాళికలు, లక్ష్యాలపై స్పష్టమైన వైఖరి ఉండాలి. నష్టభయం, రాబడి అంచనాలు, ఆర్థిక లక్ష్యాలు, వ్యవధి ఇలా పలు అంశాలను పరిశీలించాకే తగిన పథకాన్ని ఎంచుకోవాలి. ఏ సమయంలో మదుపు చేస్తున్నాం అనేదానికంటే.. ఎంత కాలం కొనసాగుతున్నాం అనేది ముఖ్యం.కోటి సులభంగానే..మ్యూచువల్ ఫండ్ల(Mutual Funds)లో సిప్ ద్వారా రూ.కోటిని జమ చేయడం కష్టమేమీ కాదు. కానీ, అందుకు దీర్ఘకాలం మదుపు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు నెలకు రూ.2,000తో సిప్ చేసిన ఫండ్ కనీసం 15 శాతం సగటు వార్షిక రాబడి వస్తుందని భావిస్తే రూ.కోటికి మించి జమ అయ్యేందుకు వ్యవధి 28 ఏళ్లు. అదే స్టెప్అప్(ఏటా సెప్ పెంచుకుంటూ వెళ్లే పద్ధతి) ద్వారా మరింత త్వరగానే ఈ లక్ష్యాన్ని చేరవచ్చు. -
మంచి మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవడం ఎలా?
దీర్ఘకాలంలో మంచి రాబడులిచ్చే మ్యూచువల్ పండ్ను ఎంచుకునే ముందు చాలామంది సాధారణంగా ఓ తప్పు చేస్తూంటారు. కేవలం గత పనితీరుపైనే ఆధారపడి ఫండ్‌ను సెలక్ట్ చేసుకుంటారు. అయితే అన్నివేళలా అలాంటి పనితీరు కనిపించకపోవచ్చు. ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ 100 శాతం రాబడులు ఇచ్చిదంటే అంతకంటే ముందుగానే ఆ పథకంలో ఇన్వెస్ట్ చేసిన వారికి అది విలువ సమకూర్చినట్టు అవుతుంది. కొత్తగా అదే పథకంలో ఇన్వెస్ట్ చేసే వారికి గత పనితీరు కేవలం ఒక సూచికే అవుతుంది. అంతేకానీ భవిష్యత్ రాబడులకు హామీ కాదు. ఒక మ్యూచువల్ ఫండ్ గత పనితీరు అన్నది మార్కెట్ల ఎత్తు, పల్లాల్లో ఎలా పనిచేసిందో తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది.కొన్ని ఫండ్స్ నష్టాల నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టొచ్చు. కొన్ని వేగంగా కోలుకుంటాయి. దీనికి అంతర్గతంగా అవి ఎంచుకున్న కంపెనీలే కారణం. కాబట్టి ఒక ఫండ్‌ను ఎంపిక చేసుకునే ముందు.. పోటీ పథకాలతో పోల్చి చూస్తే పనితీరు ఎలా ఉందన్నది విశ్లేషించాలి. అదే విభాగం సగటు పనితీరు, ఆ విభాగంలోని పోటీ పథకాలతో పోల్చితే మధ్య, దీర్ఘకాలంలో రాబడులు ఎలా ఉన్నాయన్నది పరిశీలించాలి.స్వల్పకాల రాబడులు అంత ఉపయోకరం కాదు. నిర్ణీత కాలంలో పథకంలో రాబడులు స్థిరంగా ఉన్నాయా? అని కూడా చూడాలి. బుల్ మార్కెట్లలో నిదానంగా ర్యాలీ అయి, మార్కెట్ కరెక్షన్లలో తక్కువ నష్టాలకు పరిమితం చేసే విధంగా పథకం సామర్థ్యాలు ఉండాలి. అలాంటప్పుడు ఆ పథకం రాబడుల పరంగా నిరాశ మిగల్చదు. ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డు (పనితీరు) కూడా పరిశీలించాలి.ఇదీ చదవండి: జనవరి 1 నుంచి వాట్సప్ పని చేయదు! కారణం..పథకం పనితీరు ఫండ్ మేనేజర్ ప్రతిభ వల్లే అయితే, సదరు ఫండ్ మేనేజర్ రాజీనామా చేసి వెళ్లిపోతే అది ప్రతికూలంగా మారొచ్చు. అంతేకాదు ఇన్వెస్టర్ వ్యవహార శైలి కూడా దీర్ఘకాల రాబడులను ప్రభావితం చేస్తుంది. మార్కెట్ల పతనాల్లో ఆందోళన చెందకుండా, పెట్టుబడుల విధానానికి కట్టుబడి ఉండాలి. మార్కెట్ పతనాల్లోనూ క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. -
కోటీశ్వరులు కావాలనుందా..?
దేశీయ స్టాక్‌మార్కెట్లు జీవితకాల గరిష్ఠాలను చేరుతున్నాయి. దాంతో చాలా మంది మదుపరుల సంపద ఎన్నోరెట్లు పెరుగుతోంది. ఈక్విటీ మార్కెట్లో నేరుగా డబ్బు ఇన్వెస్ట్ చేసేవారి కంటే కొంత సేఫ్‌గా ఉండే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే చిన్న మొత్తాల పొదుపుతో కోటీశ్వరులుగా మారే అసలైన ఫార్ములాను ఈ కథనంలో తెలుసుకుందాం. భవిష్యత్తు అవసరాల కోసం ఎక్కువ మంది రిస్క్ లేకుండా సంపద రెట్టింపు కావాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఎక్కువ మంది ఎస్ఐపీ(క్రమానుగత పెట్టుబడులు)లను ఎంచుకుంటారు. పైగా దీర్ఘకాలం పెట్టుబడి పెట్టేవారు దీని నుంచి మెరుగైన రాబడులను అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని అనుభవజ్ఞులైన ఫండ్ మేనేజర్లు నిర్వహించటం వల్ల ఎలాంటి ఆందోళన లేకుండా మంచి వెల్త్ సృష్టించవచ్చు. మ్యూచువల్‌ఫండ్‌లో చాలా మంది పెట్టుబడులు పెడుతూంటారు. తోచినంత మదుపుచేస్తూ దీర్ఘకాల కోరికల కోసం కష్టపడుతుంటారు. అందులో ఒకొక్కరి ఆసక్తులు ఒక్కోలా ఉంటాయి. అయితే కోటి రూపాయల టార్గెట్ అందుకోవటానికి మాత్రం ఒక నియమాన్ని పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే 15*15*15 స్ట్రాటజీ. దీనికి అర్థం..నెలకు రూ.15,000 చొప్పున.. 15 ఏళ్ల పాటు.. 15 శాతం రాబడి అందించే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులుగా మారవచ్చు. ఇందులో దాగిఉన్న కాంపౌండింగ్ ఫార్మాలాతో కార్పస్ జనరేట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. సామాన్యులను సైతం కోటీశ్వరులుగా మారేందుకు రోజుకు రూ.500 మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిగా పెడితే సరిపోతుందన్న మాట. ఇదీ చదవండి: టెస్లా యూనిట్‌కు సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..? ఇన్వెస్టర్లు క్రమం తప్పకుండా 15 ఏళ్లపాటు కొనసాగించే పెట్టుబడిపై 15 శాతం చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలిపితే రూ.75 లక్షలు అవుతుంది. ఇదే సమయంలో ఇన్వెస్టర్ పెట్టుబడి రూపంలో మెుత్తంగా రూ.27 లక్షలు పెడతారు. దాంతో మొత్తం 15 ఏళ్ల తర్వాత రాబడి రూ.1.02 కోట్లకు చేరుకుంటుంది. -
ఫండ్స్ లావాదేవీలకూ ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనల వర్తింపు!
న్యూఢిల్లీ: ప్రస్తుతం లిస్టయిన, లిస్ట్ కాబోతున్న షేర్లకు మాత్రమే పరిమితమైన ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలను మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ లావాదేవీలకు కూడా వర్తింపచేయాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది. తద్వారా ధరపై ప్రభావం చూపే కీలక సమాచారం (యూపీఎస్‌ఐ) కలిగి ఉన్న ఫండ్స్ సిబ్బంది, దాన్ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకట్ట వేయొచ్చని భావిస్తోంది. నిర్దిష్ట స్కీమునకు సంబంధించి, బైటికి ఇంకా వెల్లడించని యూపీఎస్‌ఐ సమాచారం గల ఒక మ్యూచువల్ ఫండ్ రిజిస్ట్రార్, ట్రాన్స్ఫర్ ఏజెంటు..యూనిట్లన్నీ విక్రయించేసుకుని లాభపడటం, అదే విధంగా మరో ఫండ్ ఏజెన్సీలోనూ జరగడం తదితర పరిణామాల నేపథ్యంలో సెబీ ఈ మేరకు ప్రతిపాదన చేసింది ఇందుకు సంబంధించిన చర్చాపత్రం ప్రకారం ఫండ్ యూనిట్లకు కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలను వర్తింపచేసేలా సెక్యూరిటీస్, ట్రేడింగ్, ఇన్సైడర్ ట్రేడింగ్ నిర్వచనాలను సవరించాలని ప్రతిపాదించింది. అలాగే, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల్లో నిర్దిష్ట స్థాయి వ్యక్తులు తమకు, తమ సమీప బంధువులకు సదరు సంస్థ స్కీముల్లో ఉన్న యూనిట్ల వివరాలను సెబీ నిర్దేశించిన తేదీన బహిర్గతం చేయాలి. ఆ తర్వాత నుంచి మూడు నెలలకోసారి వెల్లడించాలి. 6 గంటల్లోగా రిపోర్ట్ చేయాలి సైబర్ దాడులను గుర్తించిన ఆరు గంటల్లోగా సమాచారం ఇవ్వవలసి ఉందని ఇష్యూలను చేపట్టే అర్హతగల రిజిస్ట్రార్లు, షేర్ల బదిలీ ఏజెంట్లు(క్యూఆర్టీలు), కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ(కేఆర్ఏ)లకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దాడులు, బెదిరింపులు, నిబంధనల ఉల్లంఘన తదితర అన్ని రకాల సైబర్ ఘటనలను గుర్తించిన వెంటనే సమయానుగుణంగా దేశీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ–ఇన్)కు సైతం రిపోర్ట్ చేయవలసిందిగా తెలియజేసింది. ఇందుకు మార్గదర్శకాలను ప్రకటిస్తూ రెండు ప్రత్యేక సర్క్యులర్లను జారీ చేసింది. వీటిలో భాగంగా జాతీయ కీలక సమాచార మౌలిక రక్షణ కేంద్రం(ఎన్సీఐఐపీసీ) ద్వారా ‘రక్షణాత్మక వ్యవస్థ’గా గుర్తింపును సైతం పొందవలసి ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎన్‌సీఐఐపీసీకి సైతం సైబర్ సంఘటనలపై సమాచారాన్ని ఇవ్వవలసి ఉంటుందని సెబీ పేర్కొంది. -
ఫండ్స్ పరిశ్రమలో మహిళలకు మరింత చోటు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో మహిళా ఫండ్ మేనేజర్ల ప్రాతినిధ్యం కొంత పెరిగింది. మొత్తం 399 మంది ఫండ్ మేనేజర్లలో మహిళలు 32 మంది ఉన్నారు. 2021లో వీరి సంఖ్య 30గానే ఉంది. అంటే మొత్తం ఫండ్ మేనేజర్లలో మహిళలు 8 శాతమే ఉన్నట్టు తెలుస్తోంది. మార్నింగ్ స్టార్ సంస్థ ఇందుకు సంబంధించిన వివరాలతో ఒక నివేదికను విడుదల చేసింది. మొత్తం ఫండ్ మేనేజర్ల సంఖ్య 2021లో 376గానే ఉంటే, తాజాగా 399కు పెరగడం గమనార్హం. మహిళా ఫండ్ మేనేజర్లు రూ.4.55 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల ఆస్తులను (ఏయూఎం) నిర్వహిస్తున్నారు. మొత్తం మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ ఏయూఎం రూ.38 లక్షల కోట్లలో మహిళా ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తున్న ఆస్తుల పరిమాణం 12 శాతంగా ఉంది. గతేడాది ఇది 13.5 శాతంగా ఉండడం గమనించాలి. 45 సంస్థలతో కూడిన మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో మహిళా ఫండ్ మేనేజర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2017లో మార్నింగ్ స్టార్ మొదటిసారి నివేదిక విడుదల చేసే నాటికి మహిళా ఫండ్ మేనేజర్లు 18 మంది ఉన్నారు. 2018 నాటికి 24కు, 2019లో 29కు, 2020 నాటికి 28కి, 2021లో 30కి వీరి సంఖ్య పెరుగుతూ వచ్చింది. చాలా తక్కువ.. ‘‘కేవలం 8 శాతం అంటే మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువ ఉన్నట్టు. గడిచిన రెండేళ్లలో మహిళా ఫండ్ మేనేజర్ల శాతంలో పురోగతి ఉంది’’ అని మారి్నంగ్‌స్టార్ నివేదిక తెలిపింది. ఇక 19 మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పరిధిలో 32 మంది మహిళా ఫండ్ మేనేజర్లు పనిచేస్తున్నారు. నాలుగు ఫండ్ సంస్థల్లో ముగ్గురు అంతకంటే ఎక్కువే పనిచేస్తుంటే, నాలుగు ఫండ్ హౌస్‌లలో కనీసం ఇద్దరు చొప్పున ఉన్నారు. ఇక 11 ఫండ్స్ సంస్థల్లో కనీసం ఒక మహిళా ఫండ్ మేనేజర్ పనిచేస్తున్నారు. -
డిస్క్లెయిమర్లో హడావుడి వద్దు ! ప్రకటనలపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
ముంబై: టీవీ చానళ్లలో మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చే ప్రకటనల్లో కీలకమైన సున్నిత సమాచారానికీ అంతే ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రకటన ముందు భాగంలో ఉన్న మాదిరే, చివర్లో కీలక సమాచార వెల్లడికీ ఒకటే వేగం ఉండాలని అభిప్రాయపడ్డారు. అవసరమైతే రూ.37 లక్షల కోట్ల మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ దీన్ని పాటించేలా నిబంధనల్లో సవరణలు తీసుకొస్తామన్నారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ గోయల్ పర్యవేక్షణలోనే ఉంది. మ్యూచువల్ ఫండ్ ప్రకటన చివర్లో కచ్చితంగా వెల్లడించాల్సిన డిస్‌క్లెయిమర్‌ను చాలా వేగంగా చదవడం గమనించొచ్చు. దీనిపైనే మంత్రి స్పందించారు. ‘‘డిస్ క్లెయిమర్ (తమకు బాధ్యతలేదన్న విషయాన్ని వెల్లడించడం)ను చాలా చాలా వేగంగా చదువుతున్నారు. అలా అయితే దాన్ని అర్థం చేసుకోవడం కష్టం. ప్రకటనలో ముందు భాగం ఎంత వేగంతో నడిచిందో డిస్‌క్లెయిమర్ కూడా అలాగే నడవాలి. వేగంగా చదివి దాని ఉద్దేశ్యాన్ని నీరుగార్చకూడదు’’ అని ఎన్ఎస్ఈ కార్యక్రమంలో మంత్రి వివరించారు. చదవండి: Fund Review: మిరే అస్సెట్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ -
టాటా ఈక్విటీ పీఈ ఫండ్ పనితీరు భేష్
ఈక్విటీ మార్కెట్లు అదే పనిగా నూతన గరిష్టాలకు ర్యాలీ చేస్తుండడంతో స్టాక్స్ విలువలు మరితంగా విస్తరించాయని.. కొన్నింటి విలువలు మరీ మితిమీరిన స్థాయికి చేరాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో వ్యాల్యూ స్టాక్స్ పట్ల దృష్టి సారించాలన్న సూచన వినిపిస్తోంది. వ్యాల్యూ స్టాక్స్ అన్నవి.. వాటి అంతర్గత విలువతో (ఇంట్రిన్సిక్ వ్యాల్యూ) పోలిస్తే ఆకర్షణీయమైన ధరల వద్ద లభించేవి. గ్రోత్ స్టాక్స్ మాదిరి వ్యాల్యూ స్టాక్స్ ధరలు పరుగులు పెట్టవు. కానీ స్థిరమైన పనితీరు చూపిస్తుంటాయి. అస్థిరతలు తక్కువ. దీర్ఘకాలంలో వ్యాల్యూ స్టాక్స్ సైతం మంచి రాబడులను ఇస్తాయని చాలా మంది నిపుణుల అంచనా. కనీసం ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలానికి, దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్టర్లు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోని వ్యాల్యూ ఫండ్స్ విభాగాన్ని ఎంపిక చేసుకోవవచ్చు. ఈ విభాగంలో టాటా ఈక్విటీ పీఈ ఫండ్ పనితీరును గమనించినట్టయితే నిలకడగా కనిపిస్తుంది. పెట్టుబడుల విధానం బీఎస్ఈ సెన్సెక్స్ పీఈ కంటే 12 నెలల ట్రెయిలింగ్ పీఈ రేషియో తక్కువగా ఉన్న స్టాక్స్‌ను ఈ పథకం ఎంపిక చేసుకుంటుంది. తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 70 శాతాన్ని ఈ స్టాక్స్‌కే కేటాయిస్తుంటుంది. ఇలా ఎంపిక చేసిన కంపెనీల్లోనూ భవిష్యత్తులో మంచి వృద్ధికి అవకాశం ఉన్న వాటిని తుది జాబితాగా తీసుకుంటుంది. ఆయా రంగాల్లో కంపెనీల స్థానం ఏంటి, వాటికి ఉన్న వృద్ధి అవకాశాలు, రాబడుల రేషియోలు ఎలా ఉన్నాయి, స్టాక్ లిక్విడిటీ ఈ అంశాలన్నింటికీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. అన్ని రంగాల మధ్య, అన్ని స్థాయిల కంపెనీల్లోనూ (లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్) ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఈ పథకానికి ఉంది. పనితీరు ఈ పథకం రాబడులను గమనించినట్టయితే.. గడిచిన ఏడాది కాలంలో 47 శాతంగా ఉన్నాయి, మూడేళ్లలో చూసినా వార్షికంగా 14.52 శాతం రాబడిని ఇచ్చింది. ఐదేళ్లలో 13.61 శాతం, ఏడేళ్లలో 14.26 శాతం, పదేళ్లలో 16.62 శాతం చొప్పున వార్షిక రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. 2004లో ఈ పథకం ప్రారంభం కాగా.. నాటి నుంచి చూసుకున్నా గానీ వార్షికంగా 19 శాతం చొప్పున పెట్టుబడులపై ఇన్వెస్టర్లకు ప్రతిఫలాన్నిచ్చింది. వ్యాల్యూ ఆధారిత విభాగం సగటు రాబడులతో పోల్చి చూస్తే ఏడేళ్లు, పదేళ్లలో ఈ పథకంలో ఎక్కువ రాబడులు కనిపిస్తాయి. పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.5,021 కోట్ల ఆస్తులున్నాయి. ఇందులో 95.5 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా.. మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలోనే కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 37 స్టాక్స్ ఉన్నాయి. టాప్ 10 స్టాక్స్‌లోనే 53 శాతం పెట్టుబడులు ఉండడం గమనార్హం. పోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్ సగటు పీఈ రేషియో 23.77 శాతంగా ఉంది. 69 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ కంపెనీలకు కేటాయించగా.. మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో 27 శాతం, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో 4 శాతం వరకు పెట్టుబడులు పెట్టి ఉంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 34 శాతానికి పైనే పెట్టుబడులను కేటాయించింది. ఆ తర్వాత టెక్నాలజీ రంగ కంపెనీలకు, ఇంధనం, ఎఫ్ఎంసీజీ కంపెనీలకు ఈ పథకం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. చదవండి: స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్.. పెట్టుబడికి ఏదీ మంచిది ? -
మహీంద్రా మాన్యులైఫ్ నుంచి కొత్త ఫండ్
మహీంద్రా మాన్యులైఫ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ తాజాగా ఫ్లెక్సి క్యాప్ యోజన పేరిట కొత్త ఫండ్ ఆఫర్‌ను (ఎన్ఎఫ్వో) ప్రకటించింది. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. దీర్ఘకాలికంగా ఈక్విటీ మార్కెట్లు, ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీల్లో చేసే పెట్టుబడుల వృద్ధిని ఆశించే ఇన్వెస్టర్లకు ఇది అనువైనదిగా ఉంటుందని సంస్థ ఎండీ, సీఈవో అశుతోష్ బిష్ణోయి తెలిపారు. జులై 30న ప్రారంభమైన ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఆగస్టు 13న ముగుస్తుందని చెప్పారు. తిరిగి ఆగస్టు 25 నుంచి విక్రయాలు, కొనుగోళ్లకు ఈ స్కీమ్ అందుబాటులోకి వస్తుందని వివరించారు. ఫ్లెక్సి క్యాప్ యోజన ఫండ్ ద్వారా సమీకరించిన నిధుల్లో 65 శాతం భాగాన్ని ఈక్విటీ, ఈక్విటీ సంబంధ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయనున్నట్లు బిష్ణోయి పేర్కొన్నారు. ఇక మిగతా నిధులను రెపో, రివర్స్ రెపో వంటి డెట్, మనీ మార్కెట్ సాధనాల్లో 35 శాతం దాకా, అలాగే రీట్స్ (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు), ఇన్విట్స్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు) యూనిట్లలో 10 శాతం దాకా ఇన్వెస్ట్ చేయవచ్చన్నారు. ఈక్విటీల ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ, ఫ్లెక్సి క్యాప్ ఫండ్స్ స్థిరమైన రాబడులు అందించగలుగుతాయని పేర్కొన్నారు. -
మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు సెబీ ఆదేశం
న్యూఢిల్లీ: అన్ని రకాల డెట్ పథకాలను వడ్డీ రేట్లు, పరపతి ముప్పు (రిస్క్) ఆధారంగా వర్గీకరించాలని మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలను (ఏఎంసీలు) సెబీ ఆదేశించింది. ఇందుకు సంబంధించి సమాచార టేబుల్‌ను 2021 డిసెంబర్ 1 నుంచి తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల ఇన్వెస్టర్లు తగిన సమాచారం తెలుసుకుని పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేందుకు వీలుంటుందని శామ్కో సెక్యూరిటీస్ ‘ర్యాంక్ఎంఎఫ్’ విభాగం హెడ్ ఓంకారేశ్వర్సింగ్ చెప్పారు. మ్యూచువల్ ఫండ్ అడ్వైజరీ కమిటీ సిఫారసుల ఆధారంగా సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి: దివాలా చట్టంతో రూ.60 వేల కోట్ల వసూలు! -
క్యామ్స్- కెమ్‌కాన్ స్పెషాలిటీ.. ఐపీవోలకు రెడీ
గత వారం రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టడం ద్వారా ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీవో ఏకంగా 151 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌కాగా.. రూట్ మొబైల్ ఇష్యూకి సైతం 73 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. ఈ బాటలో తాజాగా కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్(సీఏఎంఎస్- క్యామ్స్), కెమ్‌కాన్ స్పెషాలిటీ కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వస్తున్నాయి. వివరాలు చూద్దాం.. క్యామ్స్(CAMS) లిమిటెడ్ ఈ నెల 21న(సోమవారం) ప్రారంభంకానున్న పబ్లిక్ ఇష్యూకి రూ. 1229-1230 ధరల శ్రేణిని క్యామ్స్ ప్రకటించింది. 23న(బుధవారం) ముగియనున్న ఇష్యూలో భాగంగా 1.82 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో 1,82,500 షేర్లను ఉద్యోగులకు కేటాయించనుంది. వీటిని ఐపీవో ధరలో రూ. 122 డిస్కౌంట్‌కు జారీ చేయనున్నట్లు క్యామ్స్ తెలియజేసింది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 12 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూ ద్వారా రూ. 2242 కోట్లవరకూ సమకూర్చుకోవాలని క్యామ్స్ భావిస్తోంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ)కి అనుబంధ విభాగమైన క్యామ్స్.. మ్యూచువల్ ఫండ్స్‌కు అతిపెద్ద రిజిస్ట్రార్, ట్రాన్స్ఫర్ ఏజెంట్‌గా సేవలందిస్తోంది. ఐపీవోలో భాగంగా శుక్రవారం(18న) యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించడం ద్వారా కొంతమేర నిధులు సమీకరించనుంది. కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్ కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 21న(సోమవారం) ప్రారంభంకానుంది. ఇష్యూకి రూ. 338-340 ధరల శ్రేణికాగా.. తద్వారా రూ. 318 కోట్లను సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. 23న(బుధవారం) ముగియనున్న ఇష్యూలో భాగంగా 45 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటితోపాటు మరో రూ. 165 కోట్ల విలువచేసే షేర్లను తాజాగా జారీ చేయనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 44 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఐపీవోలో భాగంగా శుక్రవారం(18న) యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించడం ద్వారా కొంతమేర నిధులు సమీకరించనుంది. కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ కెమ్‌కాన్ తయారు చేసే హెచ్ఎండీఎస్, సీఎంఐసీ తదితర స్పెషాలిటీ కెమికల్స్‌ను ప్రధానంగా ఫార్మాస్యూటికల్ రంగంలో వినియోగిస్తారు. ఐపీవో నిధులను విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. దేశీయంగా హెటెరో, లారస్ ల్యాబ్స్‌తోపాటు.. అరబిందో, ల్యాన్టెక్ తదితర ఫార్మా కంపెనీలకు సరఫరా చేస్తోంది. యూఎస్, జపాన్, చైనా తదితర దేశాలకూ ఎగుమతులు చేపడుతోంది. -
ఫండ్స్ ఎంపిక ఇలా కాదు..!
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల వైపు నేడు ఎక్కువ మంది వేతన జీవులు మొగ్గు చూపుతున్నారు. దీర్ఘకాలంలో ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇవి అనుకూలమనే అవగాహన పెరుగుతోంది. అధిక రాబడులకు ఈక్విటీలు మెరుగైన సాధనంగా ఉండడంతో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి ప్రతి నెలా సగటున రూ.8,000 కోట్లపైనే సిప్ (క్రమానుగత పెట్టుబడులు) రూపంలో పెట్టుబడులు వస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌ను ఎలా ఎంచుకోవాలనే ప్రాథమిక అవగాహన కొందరిలో ఉన్నప్పటికీ.. ఎంపిక విషయంలో పట్టిపట్టి చూడకూడని, అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేని అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటి గురించి తెలియజేసే ప్రాఫిట్ కథనం ఇది. జీవనశైలి, అవసరాలు, రిస్క్ తీసుకునే సా మర్థ్యం ఇవన్నీ మ్యూచువల్ ఫండ్స్ ఎంపికలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే, ఫండ్ పనితీరును కూడా ప్రామాణికంగా చూడాల్సి ఉం టుంది. నాణేనికి మరోవైపు అన్నట్టు ఫండ్స్‌లో పెట్టుబడులకు ఈ అంశాలను పెద్దగా పట్టించుకోకుండా, ఇతర ముఖ్య అంశాలపై ఆధారపడడం మంచిదని నిపుణుల సూచన. డివిడెండ్ డివిడెండ్ అధికంగా ఇస్తున్నాయని ఫండ్స్‌ను ఎంచుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడూ ఒకే విధమైన డివిడెండ్‌ను పంపిణీ చేయాలన్న హామీ ఉండదు. ఉదాహరణకు మార్కెట్లు పడిపోతే, సంబంధిత ఫండ్ డివిడెండ్ పంపకాన్ని తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. దీర్ఘకాలంలో సంపద సృష్టి కోసమే ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ, వస్తున్న లాభాన్ని ఎప్పటికప్పుడు డివిడెండ్ రూపంలో తీసేసుకోవడం మంచి ఆలో చన ఎంత మాత్రం కాదు. ఎందుకంటే లాభాన్ని తీసేసుకోవడం వల్ల పెట్టుబడి వృద్ధి చెందదు. పైగా ఇప్పుడు డివిడెండ్ పంపిణీపై ఈక్విటీ ఫండ్స్ అయితే 10% పన్ను పడుతోంది. అంటే ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన లాభాలపై 10% పన్నుమాదిరిగానే. కనుక డివిడెండ్ ఇస్తున్న వాటిని ఎంపిక చేసుకోవడం సూచనీయం కాదు. దీనికి బదులు అవసరమైనప్పుడు కొన్ని యూనిట్లను విక్రయించి అవసరాలు తీర్చుకోవడమే మంచిది. డెట్ ఫండ్స్‌లో అయితే డివిడెండ్ కోసం చూడడం అన్నది ఏ మాత్రం సరికాదు. దీనికంటే క్రమానుగత ఉపసంహరణ(ఎస్‌డబ్ల్యూపీ) అన్నది మరింత సమర్థవంతమైన టూల్ అవుతుంది. ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ప్రతి నెలా నిర్ణీత సంఖ్యలో యూనిట్లను ఉపసంహరించుకోవడం ద్వారా అవసరమైన మేర పొందొచ్చు. దీనివల్ల పన్ను పరంగా కలిసొస్తుంది. అదే డెట్ ఫండ్స్‌లో డివిడెండ్ ఆశిస్తే, డివిడెండ్ పంపిణీ పన్ను కింద 29.12% పడుతుంది. ఇన్వెస్టర్ ఆదాయం ఏ స్లాబ్‌లో ఉందన్నదానితో సంబం ధం ఉండదు. కానీ, ఎస్‌డబ్ల్యూపీలో పెట్టుబడిపై ఆర్జించిన లాభం వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఏ పన్ను రేటులో ఉంటే ఆ మేరకు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌డబ్ల్యూపీలో ఉపసంహరించుకునేది కొద్ది మొత్తమే ఉంటుంది కనుక పన్ను భారం అంతగా ఏమీ ఉండదు. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని డెట్ ఫండ్స్‌లో ఆర్జనకు ముడిపెట్టి సర్దుబాటు చేసుకునే వీలూ ఉంది. ఫండ్స్ సంస్థ తెలియక్కర్లేదు.. మనలో చాలా మందికి కొన్ని బ్యాంకులంటే ఎక్కువగా పరిచయం, అనుబంధం ఉండి ఉంటుంది. కనుక తెలిసిన బ్యాంకుల నిర్వహణలోని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైనదని భావించే వారూ ఉన్నారు. కానీ, ఇది నిజం కానే కాదు. ఇటీవలి డెట్ ఫండ్ సంక్షోభంలో బ్యాంకుల మద్దతుగల ఎన్నో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు నష్టాలను ఎదుర్కొన్నాయి. పైగా వీటి ఈక్విటీ రాబడుల చరిత్ర కూడా అంత గొప్పగా లేదు. మ్యూచువల్ ఫండ్స్ ట్రాక్ రికార్డుకు స్థిరత్వం ఎంతో అవసరం. ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డు కూడా ఇక్కడ కీలకం అవుతుంది. నికర విలువ స్టాక్స్‌లో పెట్టుబడుల పట్ల అవగాహన ఉన్న వారు అవే అంశాలను ఫండ్స్‌కు అన్వయించడం çసరి కాదు. స్టాక్స్‌లో 52 వారాల గరిష్ట, కనిష్ట ధరలను సాధారణంగా చూస్తుంటారు. కానీ ఫండ్స్ యూనిట్ల నికర విలువ 52 వారాల కనిష్ట స్థాయిలో ఉంటే, అది మంచి పెట్టుబడికి సంకేతంగా చూడడం తప్పిదమే కావచ్చు. ఎందుకంటే ఫండ్ మేనేజర్ ఎంచుకున్న స్టాక్స్ పనితీరు బాగాలేకపోయినా యూనిట్ల ఎన్ఏవీ పడిపోతుంది. ఇక మార్కెట్లు పడిపోయినప్పుడు ఫండ్ మేనేజర్లు సరసమైన ధరల కంటే దిగొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఈ విధమైన అవకాశాలున్నాయేమో చూడాలి. దీనికి బదులు ఇప్పటికే మీ వద్ద ఉన్న ఫండ్ యూనిట్లను తక్కువ ధరల వద్ద మరిన్ని జోడించుకోవడంపై దృష్టి సారించొచ్చు. ఫండ్ సైజు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు, సంబంధిత పథకం నిర్వహణలో ఉన్న ఆస్తులను ప్రత్యేకంగా చూడడం అవసరం లేదు. అదే డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో మాత్రం నిర్వహణ ఆస్తులను చూడడం అవసరం. ఎందుకంటే లిక్విడిటీ ఏ స్థాయిలోఉంటుందో తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈక్విటీ ఫండ్స్‌కు ఆస్తుల పరిమాణం ప్రతికూలంగా మారొచ్చు. ఉదాహరణకు స్మాల్‌క్యాప్ ఫండ్‌కు భారీ ఆస్తులు ఉంటే అది సానుకూలం కంటే ప్రతికూలమే అవుతుంది. ఇలా ఫండ్ సైజు చూసే వారు ఆస్తులను అద్భుతంగా నిర్వహించే చిన్న సైజు పథకాల్లో పెట్టుబడి అవకాశాలను కోల్పోవచ్చు. అందుకే ఓ పథకం ఎంపికకు స్థిరమైన రాబడుల చరిత్ర, పోటీ పథకాలతో పోల్చినప్పుడు ఇచ్చిన రాబడులు మెరుగ్గా ఉన్నాయా అన్నవి చూడాలి. అస్తుల పరిమాణాన్ని కాదు. వ్యయ భారం ఎక్స్పెన్స్ రేషియో... ఓ మ్యూచువల్ ఫండ్ పథకం తాను నిర్వహించే పెట్టుబడులపై అన్ని రకాల చార్జీలను కలుపుకుని ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే దానిని టోటల్ ఎక్స్పెన్స్ రేషియోగా చెబుతారు. ఫండ్స్ పథకాల ఎంపికకు చూసే అంశాల్లో ఇది కూడా ఒకటి. ఈ చార్జీలను ప్రతి రోజూ ఏఎంసీలు ఫండ్స్ యూనిట్ల ఎన్ఏవీ నుంచి మినహాయించుకుంటాయి. అంటే కనిపించే ఎన్ఏవీ ఖర్చులు మినహాయించుకున్న అనంతర విలువ అని తెలుసుకోవాలి. అయితే, అన్ని వేళలా ఈ ఎక్స్పెన్స్ రేషియోపై అంతగా ఆధారపడక్కర్లేదు. బెంచ్‌మార్క్, పోటీ పథకాల కంటే మెరుగైన పనితీరు చూపిస్తుంటే, అటువంటి పథకాల్లో ఎక్స్పెన్స్ రేషియో పట్ల అంత సున్నితంగా ఉండాల్సిన అవసరం లేదు. డెట్ ఫండ్స్‌లో రాబడులు ఎక్కువగా లేకపోతే, అప్పుడు ఎక్స్పెన్స్ రేషియో రాబడులపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. అయితే, ఫండ్ నాణ్యత, రిస్క్ ఆధారిత రాబడుల రేషియో అన్నవి ఎక్స్పెన్స్ రేషియో కంటే ముఖ్యమైనవిగా గుర్తించాలి. ఈక్విటీ ఫండ్స్‌లో ఏడాది కాల పాయింట్ టు పాయింట్ రాబడులు అన్నవి రాబడుల పనితీరుకు ప్రామాణికంగా చూడక్కర్లేదు. ఉదాహరణకు ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఈక్విటీ పథకం 2016లో పనితీరు పరంగా నంబర్ 1 స్థానంలో ఉంది. కానీ, మరుసటి ఏడాది మూడో స్థానానికి వెళ్లింది. ఒకే తరహా పనితీరు తర్వాతి సంవత్సరంలోనూ నమోదు చేయడం అన్నది కష్టమే. అందుకే పనితీరు పరంగా స్థిరత్వాన్ని చూడడం అవసరం. -
పెట్టుబడుల్లో బ్యాలన్స్...
మార్కెట్ అస్థిరతల్లో పెట్టుబడులకు తక్కువ రిస్క్‌ను ఆశించే వారు, దీర్ఘకాలంలో సంప్రదాయ ఎఫ్డీలు, పోస్టాఫీసు పథకాల కంటే కాస్త అధికరాబడులు కోరుకునే వారు పరిశీలించాల్సిన పథకాల్లో ఎస్బీఐ హైబ్రిడ్ ఈక్విటీ కూడా ఒకటి. గతంలో ఇది ఎస్బీఐ మ్యాగ్నం ఫండ్ పేరుతో నడిచింది. గతేడాదే సెబీ ఆదేశాల మేరకు పథకం పేరు మారింది. ఈ పథకం ఈక్విటీ, డెట్ రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. కానీ, డెట్ సాధనాలకు మించి రాబడులను ఇవ్వగలదు. కనీసం 65 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీల్లో పెడుతుంది. బుల్ మార్కెట్లో, బేర్ మార్కెట్లోనూ పనితీరు పరంగా ఈ పథకానికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. రాబడులు ఈ పథకం రాబడులు గడచిన ఏడాది కాలంలో మైనస్ 2 శాతంగా ఉన్నాయి. కానీ, మూడేళ్ల కాలంలో చూసుకుంటే సగటున ఏటా 10.46 శాతం, ఐదేళ్ల కాలంలో వార్షికంగా 15.39 శాతం, పదేళ్ల కాలంలో 16.19 శాతం చొప్పున రాబడులు ఇచ్చింది. 1995 డిసెంబర్ 31న ఈ పథకం ప్రారంభం కాగా, అప్పటి నుంచి చూసుకుంటే వార్షిక రాబడులు 15.84 శాతంగా ఉన్నాయి. కనుక దీర్ఘకాలంలో ఓ బ్యాలన్స్డ్ ఫండ్‌లో ఈ స్థాయి రాబడులు మెరుగైనవేనని చెప్పుకోవాలి. రిస్క్ ఎక్కువగా తీసుకోలేని వారికి ఈ తరహా బ్యాలన్స్డ్ ఫండ్స్ అనుకూలం. పెట్టుబడుల విధానం పెట్టుబడుల కేటాయింపును ఈ పథకం మేనేజర్లు తెలివిగా చేస్తుంటారు. ఆటుపోట్ల సమయాల్లో ఈక్విటీ ఎక్స్పోజర్ను తగ్గించుకుని నగదు నిల్వలు పెంచుకుంటారు. 2011 మార్కెట్ కరెక్షన్లో, 2015 ఒడిదుడుకుల సమయాల్లో ఈక్విటీలకు ఎక్స్పోజర్ తగ్గించుకోవడం వల్ల ఈ పథకంలో నష్టాలు పరిమితం అయ్యాయి. 2014 బాండ్ మార్కెట్ ర్యాలీ ప్రయోజనాలను సైతం పొందింది. 2018 మార్కెట్ల అస్థిరతల్లోనూ ఈక్విటీలో అధిక పెట్టుబడులను కాస్త తగ్గించుకుంది. ఈ విధమైన వ్యూహాలతో నష్టాలను పరిమితం చేయడం, లాభాలను ఒడిసిపట్టడం ఈ ఫండ్ మేనేజర్లు చేసే పని. ప్రస్తుతానికి ఈక్విటీల్లో 71.95 శాతం, డెట్‌లో 25.76 శాతం, నగదు నిల్వలు రూ.2.29 శాతం కలిగి ఉంది. ఈ పథకం ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో 58 స్టాక్స్ ఉన్నాయి. మూడు రంగాల కంపెనీల్లోనే 44 శాతం వరకు ఇన్వెస్ట్ చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్‌కు 27 శాతం వరకు కేటాయింపులు చేసింది. ఆ తర్వాత సేవల రంగానికి 9 శాతం వరకు కేటాయింపులు ఉన్నాయి. ఎనర్జీ, టెక్నాలజీ, ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్ రంగాలకు సుమారు ఐదు శాతం చొప్పున కేటాయింపులు ఉన్నాయి. ఈ పథకంలో కనీసం రూ.1,000 మొత్తంతో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రతీ నెలా సిప్ రూపంలో అయితే రూ.500 నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. టాప్ హోల్డింగ్స్ అంశం పెట్టుబడుల శాతం హెచ్డీఎఫ్సీ 5.85 ఎస్బీఐ 4.55 కోటక్ బ్యాంకు 3.95 బీపీసీఎల్ 2.99 ఆర్ఐఎల్ 2.74 ఇన్ఫోసిస్ 2.53 దివిస్ ల్యాబ్స్ 2.43 ఐసీఐసీఐ బ్యాంకు 2.39 ఐటీసీ 2.36 భారతీ ఎయిర్టెల్ 2.29 -
యస్‌బ్యాంక్ లాభం 28% అప్
న్యూఢిల్లీ : ప్రైవేట్ రంగంలోని యస్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి 28 శాతం వృద్ధితో రూ.551 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం పెరగడం వల్ల నికర లాభంలో రెండంకెల వృద్ధి నమోదైందని వివరించింది.కాగా ఆదాయం 42 శాతం వృద్ధితో రూ.1,060 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.3,093 కోట్ల నుంచి రూ.3,797 కోట్లకు ఎగసింది. కాగా త్వరలో బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలోకి ప్రవేశించనుంది.