మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలకు సెబీ ఆదేశం | Debt Mutual Funds: Sebi Asks For Disclosure Based On Interest, Credit Risk | Sakshi
Sakshi News home page

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలకు సెబీ ఆదేశం

Published Tue, Jun 8 2021 2:09 PM | Last Updated on Tue, Jun 8 2021 2:10 PM

Debt Mutual Funds: Sebi Asks For Disclosure Based On Interest, Credit Risk - Sakshi

న్యూఢిల్లీ: అన్ని రకాల డెట్‌ పథకాలను వడ్డీ రేట్లు, పరపతి ముప్పు (రిస్క్‌) ఆధారంగా వర్గీకరించాలని మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ సంస్థలను (ఏఎంసీలు) సెబీ ఆదేశించింది. ఇందుకు సంబంధించి సమాచార టేబుల్‌ను 2021 డిసెంబర్‌ 1 నుంచి తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల ఇన్వెస్టర్లు తగిన సమాచారం తెలుసుకుని పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేందుకు వీలుంటుందని శామ్కో సెక్యూరిటీస్‌ ‘ర్యాంక్‌ఎంఎఫ్‌’ విభాగం హెడ్‌ ఓంకారేశ్వర్‌సింగ్‌ చెప్పారు. మ్యూచువల్‌ ఫండ్‌ అడ్వైజరీ కమిటీ సిఫారసుల ఆధారంగా సెబీ ఈ నిర్ణయం తీసుకుంది.

చదవండి: దివాలా చట్టంతో రూ.60 వేల కోట్ల వసూలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement