పత్రికల్లోనే అభివృద్ధి | Vijay Sai Reddy Fires On Tdp Government | Sakshi
Sakshi News home page

పత్రికల్లోనే అభివృద్ధి

Published Mon, Jan 1 2018 8:49 AM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM

Vijay Sai Reddy Fires On Tdp Government - Sakshi

మదనపల్లె : టీడీపీ పాలనలో అభివృద్ధి పత్రికల్లో తప్ప ప్రత్యక్షంగా ఎక్కడా కనిపించడం లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర విజయవంతం విషయమై స్థానిక దేశాయ్‌ ఫంక్షన్‌ హాలులో ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. విజయసాయిరెడ్డి మాట్లాడు తూ, 2014 ఎన్నికల్లో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రజలను అడుగడుగునా మోసగిస్తూ, సొంత ఆస్తుల పెంపే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. ప్రస్తుత ప్ర భుత్వ అరాచకాలను, అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పా ర్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు.

 కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకి పార్టీ అధికారంలోకి రాగానే సముచిత స్థానం కల్పిస్తుందని తెలిపారు. ప్రజల సమస్యలను జగన్‌ దృష్టికి తీసుకువచ్చి సమస్యల పరిష్కారానికి సలహాలు, సూచనలు అందజేస్తూ ప్రజామోద మేనిఫెస్టో రూపకల్పనకు సహకరించాలన్నారు. ఎమ్మెల్యే డా.దేశాయ్‌తిప్పారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పాదయాత్రను తమ ఇంటి కార్యంగా భావించి విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. సీటీఎంలో చేనేత సదస్సు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే డా.దేశాయ్‌తిప్పారెడ్డి తెలిపారు. ఆదివారం సీటీఎంలో చేనేత సదస్సు ఏర్పాట్లను వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పరిశీలించారు. 

పాదయాత్రకు మద్దతుగా మెగా బైక్‌ ర్యాలీ
జగన్‌ పాదయాత్రకు మద్దతుగా ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మెగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది యువకులు తరలిరాగా, విజయసాయిరెడ్డి వారందరితో కలిసి తానూ స్వయంగా ద్విచక్రవాహనం నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్‌ సర్కిల్, ఆర్టీసీ బస్టాండు, అప్పారావు వీధి, బెంగళూరు బస్టాండు, ఎన్టీఆర్‌ సర్కిల్, నీరుగట్టువారిపల్లె, బైపాస్‌ రోడ్‌ మీదుగా అంబేడ్కర్‌ సర్కిల్‌కు చేరుకుంది. ర్యాలీ పొడగునా యువత జై జగన్‌.. జై వైఎస్సార్‌ అంటూ నినదించారు. కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర ప్రధాన మహిళా కార్యదర్శి షమీం అస్లాం, ఎంపీపీ సుజనా బాలకృష్ణారెడ్డి, సీనియర్‌ నాయకులు జింకా వెంకటాచలపతి, దేశాయ్‌ జయదేవ్, చిప్పిలి జగన్నాథరెడ్డి, చేనేత విభాగం అధ్యక్షులు భువనేశ్వరి సత్య, కౌన్సిలర్లు మస్తాన్‌రెడ్డి, బీఏ.ఖాజా, ఫర్జానా రఫీ, పూల వేమనారాయణ, ఆంజనేయులు, నాయకులు మస్తాన్‌ ఖాన్, ఇర్ఫాన్‌ ఖాన్, షరీఫ్, ఎస్‌ఏ.కరీముల్లా, కమాల్, హర్షవర్ధన్‌రెడ్డి, పాల్‌ బాలాజి, పట్టణ కన్వీనర్‌ సురేంద్ర, రూరల్‌ కన్వీనర్‌ మహేష్, జన్నే రాజేంద్ర, ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ కోటూరి ఈశ్వర్, మహిళా విభాగం రోలింగ్‌ మల్లిక, సెల్వి, వైజయంతి, సర్పంచ్‌లు శరత్‌రెడ్డి, నాగరాజరెడ్డి, నాగిరెడ్డి, పూజారి రమేష్, మేస్త్రీ శ్రీనివాసులు, నూర్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement