
సాక్షి, హైదరాబాద్ : ఆధార్ సమాచారానికి సరైన భద్రత లేదని, సైబర్ దాడి జరిగితే ఊహించని నష్టం జరుగుతుందంటూ నిన్న (బుధవారం) మీడియాలో వచ్చిన వార్తకు, తమకు ఏ సంబంధం లేదని ఆర్‌బీఐ అనుబంధ ఐడీఆర్‌బీటీ (ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ) పేర్కొంది.
కొన్ని మీడియా సంస్థలు ఆ వార్తలోని అంశాలను ఆర్‌బీఐ పరిశోధకులకు ఆపాదించారనీ, సదరు నివేదికలో ఆర్‌బీఐకిగానీ, తమకుగానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. నివేదిక తయారు చేసిన అధ్యాపకుడు ఎస్ అనంత్ తమ సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా మాత్రమే పని చేస్తున్నారని ఐడీఆర్‌బీటీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment