
ప్రతీకాత్మక చిత్రం
ఢిల్లీ : స్వస్థలానికి చేరుస్తామంటూ 16ఏళ్ల బాలికపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఓ ఇంట్లో పనిమ్మాయిగా పనిచేస్తున్న బాలిక తన స్వస్థలమైన జార్ఖండ్ వెళ్లేందుకు ఢిల్లీ రైల్వేస్టేషనుకు చేరుకుంది. అక్కడ ముగ్గురు వ్యక్తులు ఆమెను ఇంటికి చేరుస్తామని నమ్మబలికి ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ను బలవంతంగా తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు. స్పృహ తప్పి పడిపోయి ఉన్న ఆమెను గమనించిన ఓ పోలీసు కానిస్టేబుల్ బాలికను స్టేషనుకు తీసుకెళ్లి విచారించగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అనంతరం బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి శిశు సంక్షేమ కమిటీకి అప్పగించినట్లు అధికారి ఒకరు పేర్కొన్నారు. (మరదలిపై వ్యామోహంతో భార్యను..)
Comments
Please login to add a commentAdd a comment