
సాక్షి, సిద్ధిపేట : జిల్లాలోని గజ్వేల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. టాటాఎస్ వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా పది మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని గజ్వెల్ ఆస్పత్రికి తరలించారు. గజ్వేల్ మండలం రిమ్మనగూడెం వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment