
నిందితురాలు వంతాల రస్మోను చెట్టుకు కట్టిన దృశ్యం, రోదిస్తున్న చిన్నారి తల్లి
విశాఖపట్నం ,పెదబయలు(అరకులోయ): మేలు కోరవలసిన మేనత్తే ఆ చిన్నారి పాలిట మృత్యుదేవతగా మారింది. అల్లారిముద్దుగా చూడవలసిన మేనకోడలిని దారుణంగా హత్య చేసింది. వదినపై కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టింది. పెదబయలు మండలం అడుగులపుట్టు పంచాయతీ లకేయిపుట్టు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కొర్రా సుందరరావు తన చెల్లెలు రస్మోని లక్ష్మీపేట పంచాయతీ కప్పాడ గ్రామానికి వంతాల చిరంజీవికి ఇచ్చి వివాహం చేశాడు. ఆమె భర్తతో గొడవ పడి తన అన్న çసుందరరావు, వదిన చిన్నమ్మి వద్ద ఉంటోంది. సుందరరావు, చిన్నమ్మికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడాది క్రితం అనార్యోగంతో సుందరరావు మృతి చెందాడు.
చిన్నమ్మి, ఆమె పిల్లలు, రస్మో కలిసి ఉంటున్నారు. వారం రోజుల క్రితం కాపురానికి రమ్మని పిలవడానికి రస్మో భర్త చిరంజీవి లకేయిపుట్టు వచ్చాడు. గొడవలు మాని, కాపురానికి వెళ్లమని రస్మోకి ఆమె వదిన చిన్నమ్మి కూడా చెప్పింది. దీంతో రస్మో ఆగ్రహించింది. అయితే చిన్నమ్మిని ఏమీ అనలేకపోయింది. మంగళవారం ఉద యం గ్రామ సమీపంలో కర్రలు కొట్టడానికని చిన్నమ్మి కుమార్తె అను(6)(రస్మోకు మేనకోడలు)తో పాటు గ్రామానికి చెందిన పాంగి సంధ్యను రస్మో తీసుకెళ్లింది. చిన్నమ్మికోపంతో అక్కడ కట్టెలు కొట్టే కత్తితో అను మెడపై నరికి దారుణంగా హత్య చేసింది. ఈ విషయం గమనించిన సంధ్యన గ్రామానికి పరుగున వచ్చి గ్రామస్తులకు సమాచారం ఇచ్చింది. హత్యచేసిన వెంటనే గ్రామంలో కుళాయి వద్దకు వచ్చి, వంటికి అంటిన రక్తాన్ని కడుగుకుంటూ ఉండగా రస్మోను గ్రామస్తులు పట్టుకుని చెట్టుకు కట్టారు. అనంతరం పెదబయలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులో తీసుకున్నారు. అను గ్రామంలో ఎంపీ ఎలిమెంటరీ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. చిన్నారి మృతదేహానికి పోస్టుమారానికి తరలించారు. కుమార్తె మృతి చెందడంతో తల్లి చిన్నమ్మి గుండెలవిసేలా రోదించింది. గ్రామంలోవిషాదఛాయలు అలము కున్నాయి. ముందురోజు రస్మోనాటుసారా పూటుగా తాగినట్టు గ్రామస్తులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment