girl child killed
-
తెలిసిన వాడని ఆశ్రయమిస్తే..
సాక్షి, రాంగోపాల్‌పేట్: తెలిసిన వాడిగా ఉంటూ ఓ వ్యక్తి ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి పరారయ్యాడు. ఈ ఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాలిక తల్లిదండ్రులు, పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ మర్కెలి జిన్నారంకు చెందిన ముద్దనగుల తిరుపతి రాజు, నాగమణిలు భార్యాభర్తలు. వీరికి ఐదేళ్ల అనుష్క అనే కుమార్తె ఉంది. గత కొద్ది నెలల నుంచి వీరు ఉపాధి కోసం శంషాబాద్ కవిరెడ్డికాలనీకి వచ్చి కారి్మకులుగా పనిచేస్తున్నారు. గత ఆరు నెలల క్రితం వీరితో పాటు సిద్దిపేట జిల్లా గురువన్నపేటకు చెందిన శివ పనిచేశాడు. గత ఐదు రోజుల క్రితం మళ్లీ తిరుపతి రాజు వద్దకు వచ్చిన శివ వీరితో పాటు ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం శివ, తిరుపతిరాజులు కల్లు తాగారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తిరుపతి రాజు కుటుంబం యాదగిరిగుట్టకు వెళ్లడానికి శంషాబాద్ నుంచి రైలులో కాచిగూడకు వచ్చారు. వారితో పాటు శివ కూడా వచ్చాడు. కాచిగూడలో రైలు దిగి ఎంఎంటీఎస్‌లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో సికింద్రాబాద్ స్టేషన్ ప్రాంతంలోని కారు పార్కింగ్ వద్ద అందరూ ఉన్నారు. తినడానికి ఏదైనా తీసుకుని వచ్చేందుకు తిరుపతి రాజు, ఆయన భార్య ఇద్దరు బయటకు వెళ్లగా శివ వద్ద వారి కుమార్తె అనుష్కను ఉంచి వెళ్లారు. వాళ్లు తిరిగి వచ్చేసరికి అక్కడ శివతో పాటు వారి కుమార్తె కూడా కనిపించలేదు. రైల్వే స్టేషన్ చుట్టు పక్కల గాలించినా ఇద్దరి ఆచూకీ కనిపించలేదు. దీంతో రాత్రి గోపాలపురం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. గోపాలపురం ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్ డీఐ వెంకటేశ్వర్లుతో పాటు యుగంధర్‌రెడ్డి తదితర సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందంతో గాలింపు చేపట్టారు. పోలీసుల అదుపులో నిందితుడు బాలికను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిన నిందితుడు శివను పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కిడ్నాప్‌కు గురైన బాలిక సురక్షితంగా పోలీసులు రక్షించారు. రాయగిరి పోలీస్‌స్టేషన్‌లో ఉన్న బాలికను పోలీసులు నగరానికి తీసుకునివచ్చారు. ఫిర్యాదు చేసిన 12 గంటల్లోపు నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తీసుకుని వచ్చి విచారణ చేపట్టారు. శివ గతంలో కొన్ని దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తెలిసింది. పూర్తి విచారణ చేపట్టిన అనంతరం ఆదివారం నిందితున్ని మీడియా ముందుకు ప్రవేశపెట్టనున్నారు. -
మూడో వివాహానికి అడ్డుగా ఉందని..
చెన్నై, వేలూరు: రెండేళ్ల చిన్నారిని హత్య చేసి మృతదేహాన్ని పారవేసి వెళ్లిన సంఘటన వేలూరు సమీపంలోని కమ్మవాన్‌పేటలో జరిగింది. వివరాలు.. కమ్మవాన్‌పేటలో మేట్టుమలై కొండపై మురుగన్ ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అక్కడికి ఆదివారం పనులకు వెళ్తున్న కార్మికులకు దుర్వాసన రావడంతో పరిసర ప్రాంతాల్లో గాలించారు. పల్లంలో దాదాపు రెండేళ్ల చిన్నారి మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా ఆర్కాడు సమీపంలోని తామనరై గ్రామానికి చెందిన తంగమణి అనే వ్యక్తి ఆర్కాడుకు తాయనూరు గ్రామానికి చెందిన చిన్నారి కనిపించడం లేదని చిన్నారి తల్లిపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు తాయనూరు గ్రామానికి చెందిన మంజుల(22)ను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. కొద్ది రోజుల క్రితం ఆమె రాజామణి అనే వ్యక్తిని మూడవ వివాహం చేసుకున్నట్లు తెలిసింది. విచారణలో ఆమెపై అనుమానం రావడంతో విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. మూడవ వివాహం చేసుకునేందుకు తన కుమార్తె అడ్డుగా ఉండడంతో హత్య చేసి కొండపై మృతదేహాన్ని వేసినట్లు తెలిపింది. మంజుల మొదటగా మేన మామను వివాహం చేసుకుంది. అనంతరం జిల్లాకు చెందిన పాండియన్‌ను రెండో వివాహం చేసుకుంది. వీరిద్దరికీ ఒక ఆడ శిశువు జన్మించింది. తరువాత రెండవ భర్తను వదిలి పెట్టి చిన్నారితో పాటు తాయనూరులో జీవించేది. ఆ సమయంలో ఆర్కాడు సమీపంలోని వసనూరు గ్రామానికి చెందిన రాజామణితో పరిచయం ఏర్పడి ఇద్దరూ వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఇందుకు చిన్నారి అడ్డుగా ఉందని భావించి ఈనెల 22వ తేదిన చిన్నారిని హత్య చేశారు. కమ్మవాన్‌పేట కొండలో మృతదేహాన్ని పారవేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
నెల శిశువును హతమార్చిన నానమ్మ
సాక్షి, చెన్నై : ఆడ బిడ్డగా పుట్టడమే ఆ శిశువుకు శాపంగా మారింది. అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన నానమ్మే తనను హతమారుస్తుందని కూడా తెలియని ఆ శిశువు మరణం మిస్టరీ ఓ నర్సు రూపంలో వెలుగులోకి వచ్చింది. కృష్ణగిరిలో ఈఘతకం చోటు చేసుకుని ఉన్నది. కృష్ణగిరి, ధర్మపురి జిల్లాల్లో ఆడ శిశువు మరణాలు ఒకప్పుడు మరీ ఎక్కువే. ఆడ బిడ్డ పుట్టిందంటే క్షణాల్లో హతమార్చిన కషాయి కుటుంబాలు ఎన్నో. ఇక్కడి ఇతి వృత్తాంతో సినిమాలు సైతం తెరకెక్కి ఉన్నాయి. దీంతో ఆడ శిశు మరణాల కట్టడి చేయడానికి పాలకులు తీవ్రంగానే కొరడా ఝుళిపించారు. ప్రస్తుతం ఈ మరణాలు అదుపులోనే ఉన్నా, చాప కింద నీరులా గుట్టు చప్పుడు కాకుండా శిశు హత్యలు సాగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఓ కసాయి నాన్నమ్మే ఓ ఆడ శిశువును హతమార్చడం వెలుగులోకి వచ్చింది. రెండో బిడ్డ కూడా... కృష్నగిరి జిల్లా పోచ్చం పల్లి సమీపంలో పారూర్ నాగర్ కొట్టు గ్రామానికి చెందిన రాజా కూలి కార్మికుడు. రాజకు సత్యతో నాలుగేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఆరాద్య(3) కుమార్తె ఉంది. తన కుమారుడికి మగ బిడ్డ పుట్టాలని రాజ తల్లి పొట్టియమ్మాల్ మొక్కని దేవుళ్లు అంటూ లేదు. చివరకు రెండో సారిగా కోడలు గర్భం దాల్చడంతో , ఈ సారి పుట్టబోయేది మగ బిడ్డే అన్న «ధీమాతో పొట్టియమ్మాల్ ఉంటూ వచ్చింది. అయితే, గత నెల మరో పండంటి ఆడ బిడ్డకు సత్య జన్మనిచ్చింది. అప్పటి నుంచే పొట్టియమ్మాల్ రుస రుసలాడుతూ తన కోపాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. ఇరుగు పొరుగు వారు నచ్చ చెప్పడంతో ఆ బిడ్డను, కోడల్ని ఇంటికి తీసుకొచ్చింది. ఆ బిడ్డను ఎంతో అల్లారు ముద్దుగా పొట్టియామ్మల్ చూసుకుంది. అయితే, ఇదంతా నటనే అన్నది రాజ, సత్యలకు కూడా తెలియదు. ఈ నేపథ్యంలో గత వారం రాజ, సత్యలు సామాన్లు కొనుకున్నేందుకు బయటకు వెళ్లారు. వచ్చి చూడగా, పొట్టియమ్మాల్ బోరున విలపిస్తూ బిడ్డ ఊపిరి ఆడక తల్లడిల్లిందని, తాను చేయాల్సిందంతా చేశానని, ఉలుకు పలుకు లేదని కన్నీటి పర్యంతంతో నాటకాన్ని రక్తికట్టించింది. బిడ్డ మరణించడంతో ఓ బాక్స్‌లో పెట్టి ఇంటికి సమీపంలో ఖననం చేశారు. ఇంత వరకు అన్నీ బాగానే ఉన్నా, సోమవారం ఆ ఇంటికి వచ్చిన గ్రామ నర్సు రూపంలో అసలు గుట్టు బయటకు వచ్చింది. కసాయి నాన్నమ్మ అరెస్టు... బిడ్డకు టీకా వేయడం కోసం నర్సు మంగై ఆ ఇంటికి వచ్చింది. విషాదంతో ఉన్న సత్యను చూసి ఎక్కడ బిడ్డ అని ప్రశ్నించింది. జరిగిన విషయాన్ని ఆమెతో పంచుకుని సత్య విలపించింది. అన్ని విన్న మంగైను అనుమానం వీడ లేదు. బిడ్డ ఆరోగ్య వంతంగా ఉందని, తానే అన్ని రకాల పరీక్షలు నిర్వహించానని, ఎలా ఊపిరి ఆడ కుండా మరణిస్తుందని సత్య దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఈ సమాచారాన్ని జిల్లా ఆరోగ్య శాఖ అధికారి దృష్టికి ఆ నర్సు తీసుకెళ్లింది. పోలీసు సహకారంతో ఆరోగ్య అధికారులు రంగంలోకి దిగడంతో పొట్టియమ్మాల్ రంగు బయట పడింది. తన కుమారుడికి మగ బిడ్డ పుట్టాలని తాను వేడుకోని దేవుళ్లు లేదని, అయితే, తొలి బిడ్డ ఆడ బిడ్డగా పుట్టడంతో సర్దుకున్నట్టు ఆమె పోలీసు దృష్టికి తెచ్చింది. ఈ సారైనా మగ బిడ్డ పుడుతాడుకుంటే, మళ్లీ ఆడ బిడ్డే పుట్టిందని, అందుకే తనకు ఇష్టం లేకున్నా, ఇంటికి రప్పించానని, తన కుమారుడు, కోడలుకు కూడా తెలియకుండా పాలలో మందు కలిపి ఇచ్చి హతమార్చి, ఊపిరి ఆడకుండా మరణించినట్టు నాటకం ఆడినట్టు వాంగ్ములం ఇచ్చింది. ఈ నర్సు మంగై రూపంలో తన బండారం బయటకు వచ్చిందని పేర్కొంటూ, ఆమె మీద తన కోపాన్ని ప్రదర్శించింది. దీంతో పొట్టియమ్మాల్ను అరెస్టు చేసిన పోలీసులు ఆ శిశువు మృత దేహాన్ని మంగళవారం బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. -
అప్పుడే పుట్టిన ఆడపిల్లను గొంతు నులిమి
ఉప్పల్: ఓ పక్క మహిళా దినోత్సవం జరుపుకోవడానికి సిద్ధమవుతుండగా మరో పక్క అప్పుడే పుట్టిన ఆడపిల్లను గొంతు నులిమి హత్య చేసిన సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన మేరకు.. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసికందును గుడ్డలో చుట్టి చిలుకానగర్ దారిలోని నాలా పక్కన గల శ్మశానవాటికలో చెట్ల పొదల్లో వదిలేసి వెల్లిపోయారు. మృతదేహంపై బొడ్డు అలాగే ఉందని, అప్పటికే సగభాగం కుళ్లిపోయి ఉందని పోలీసులు గమనించారు. ఉప్పల్ జీహెచ్ఎంసీలో స్వీపర్‌గా పని చేస్తున్న కంబాల లక్ష్మీ(40) శ్మశానవాటిక వద్ద రోడ్డు ఊడ్చుతుండగా దుర్వాసన వచ్చింది. వెంటనే శ్మశానవాటికలోని చెట్ల పొదల వద్ద వెళ్లి చూడగా మృతిచెందిన ఆడశిశువు కనబడింది. దీంతో వెంటనే 108కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టుమార్ట్రం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. -
చంటి బిడ్డ దారుణ హత్య..?
శ్రీరంగరాజపురం: అమ్మఒడిలో ఆడుకోవాల్సిన ఐదు నెలల చిన్నారి.. నీటి డ్రమ్ములో శవమై తేలింది. ఈ ఘటన శ్రీరంగరాజపురం మండలం పిల్లిగుండ్లపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. శ్రీరంగరాజపురం మండలం మెదవాడ గ్రామానికి చెందిన భువనేశ్వరికి ఇద్దరు మగ బిడ్డలున్నారు. రెండో బిడ్డ కాన్పు కోసం గతేడాది అమ్మగారి ఊరైన పిల్లిగుండ్లపల్లి చేరుకుంది. రెండో బిడ్డ జన్మించి ప్రస్తుతం 5 నెలలు అయ్యింది. తల్లి భువనేశ్వరి తెలిపిన వివరాలు.. ‘‘మంగళవారం ఉదయం నా బిడ్డుకు పాలు తాపించిన వెంటనే ఇంటిలోని ఊయలలో పడుకోబెట్టాను. అనంతరం ఒక వైపు నేను, మరోవైపు నా అక్క రేవతి పడుకొని నిద్రలోకి జారుకున్నాం. 11 గంటల సయమంలో అక్క రేవతి నిద్రలేచి బాబు లేదని చెప్పింది. వెంటనే బిడ్డ ఆచూకీ కోసం చుట్టు పక్కల వెతికాం. గ్రామంలో ప్రజలను విచారించాం. ఎక్కడా కనబడకపోవడంతో ఆందోళన చెందాం. ఈ కమంలో బంధువైన ఒక ఆమె ఇంటి పక్కనే నీటి డ్రమ్మును పరిశీలించాం. డ్రమ్ము మూత తీసి చూడగా.. చంటి బిడ్డ శవమై కనబడింది’’. దీనిపై గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హూటాహుటినా రంగంలోకి దిగిన ఎస్ఐ సుమన్ జరిగిన విషయాన్ని పుత్తూరు డీఎస్పీ సౌమ్యలతకు చేరవేశారు. ఆమె క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దించారు. వీటిద్వారా వివరాలు సేకరించిన అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ చంటిబిడ్డ హత్యను చేసిన వారిని విచారణలో గుర్తిస్తామన్నారు. కాగా చంటి బిడ్డ హత్య విషయం చుట్టు పక్కల పాకడంతో.. జనం తండోపతండాలుగా తరలివచ్చారు. సీఐ చల్లనిదొర నేతృత్యంలో పోలీసులు వివరాలు సేకరించారు. బిడ్డ హత్యకు గురి కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
బాలిక దారుణ హత్య
వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాల్లో పెనుతుపాను రేపుతున్నాయి. పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదూర్రు గ్రామంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఎనిమిదేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. బాలిక తల్లితో వివాహేతర సంబంధం తెంచుకోలేక కక్ష పెంచుకొన్న ఓ వ్యక్తి కుటుం బంపై దాడి చేసి బాలికను పొట్టనపెట్టుకున్న సంఘటన సంచలనం రేపింది. కృష్ణాజిల్లా, పెనుగంచిప్రోలు (జగ్గయ్యపేట) : మండలంలోని గుమ్మడిదూర్రు గ్రామంలో ఎనిమిదేళ్ల బాలిక దారుణ హత్యకు గురైన ఘటన మంగళవారం అర్ధరాత్రి తర్వాత చోటు చేసుకుంది. ఊరు చివర ఇంట్లో నిద్రిస్తున్న వారిపై అకస్మాత్తుగా దాడికి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తి ఇంటి యజమానిపై దాడి చేయటంతో పాటు ఇంట్లో ఉన్న బాలికను ఎత్తుకెళ్లి హత్య చేశాడు. బాలిక అమ్మమ్మ పల్లపు రమణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వేముల కృష్ణ, ధనలక్ష్మి దంపతులు. వీరికి ఈశ్వరి (8), లోకేష్ (6) సంతానం. కృష్ణ గ్రామంలోనే వ్యవసాయ పనులు చేస్తుండగా, ధనలక్ష్మి జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు సమీపంలోని ఒక టెక్స్టైల్ ఫ్యాక్టరీలో రోజువారీ కూలీగా గతంలో పని చేసేది. పనిచేసే క్రమంలో ధనలక్ష్మికి గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడి రానురాను అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం ఇంట్లో తెలియటంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు వస్తుండటంతో ధనలక్ష్మిని టెక్స్టైల్ ఫ్యాక్టరీలో పని మాన్పించటంతో కొంత కాలంగా గ్రామంలోనే వ్యవసాయ పనులకు వెళ్తోంది. అయినప్పటికీ సదరు వ్యక్తితో ధనలక్ష్మి ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆ వ్యక్తిని నాలుగు రోజుల క్రితం చిల్లకల్లులో జరిగిన ఒక దైవ కార్యక్రమం సందర్భంగా పిలిపించి పెద్దల సమక్షంలో మందలించారు. దీంతో కోపం పెంచుకున్న ఆ వ్యక్తి ధనలక్ష్మిని తనతో పంపకపోతే ఏ క్షణంలోనైనా వచ్చి మీ కుటుంబ సభ్యులను చంపుతానని పలుమార్లు ఫోన్లో బెదిరించాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి వేముల కృష్ణ, ధనలక్ష్మి పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ వారి కల్యాణానికి వచ్చారు. అనంతరం ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న సమయంలో ఫోన్లో బెదిరించిన వ్యక్తి మొదట ఇనుప రాడ్‌తో కృష్ణపై దాడి చేశాడు. మరుక్షణం మంచంపై నిద్రిస్తున్న బాలిక ఈశ్వరిని లాక్కొని పరారయ్యాడు. తేరుకున్న కుటుంబ సభ్యులు అతని వెంటపడ్డారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, బంధువులు కూడా గ్రామంలో వెతికారు. అయితే, ఎంత వెతికినా బాలిక ఆచూకీ లభించలేదు. సమాచారం తెలిసిన పోలీసులు వచ్చి గ్రామంలో గాలింపు చర్యలు చేపట్టగా ఇంటి సమీపంలో కంప చెట్ల మధ్య తీవ్రంగా గాయపడి మూలుగుతున్న బాలికను గుర్తించారు. వారు వెంటనే బాలికను పెనుగంచిప్రోలు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందనట్లు వైద్యాధికారి అనిల్‌కుమార్ తెలిపారు. బుధవారం నందిగామ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్, జగ్గయ్యపేట సీఐ అబ్ధుల్ నబీ, ఎస్ఐలు ఎం నాగదుర్గారావు, చిరంజీవి, ఉమామహేశ్వరరావు, క్లూస్ టీమ్ గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. వేముల ధనలక్ష్మి, ఆమె తల్లి పల్లపు రమణను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. సీఐ నబీ మాట్లాడుతూ విచారణ జరుగుతోందని, త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామన్నారు. అయితే హత్య చేసిన వ్యక్తి కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. -
వదినమీద కోపంతో మేనకోడలిపై..
విశాఖపట్నం ,పెదబయలు(అరకులోయ): మేలు కోరవలసిన మేనత్తే ఆ చిన్నారి పాలిట మృత్యుదేవతగా మారింది. అల్లారిముద్దుగా చూడవలసిన మేనకోడలిని దారుణంగా హత్య చేసింది. వదినపై కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టింది. పెదబయలు మండలం అడుగులపుట్టు పంచాయతీ లకేయిపుట్టు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కొర్రా సుందరరావు తన చెల్లెలు రస్మోని లక్ష్మీపేట పంచాయతీ కప్పాడ గ్రామానికి వంతాల చిరంజీవికి ఇచ్చి వివాహం చేశాడు. ఆమె భర్తతో గొడవ పడి తన అన్న çసుందరరావు, వదిన చిన్నమ్మి వద్ద ఉంటోంది. సుందరరావు, చిన్నమ్మికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడాది క్రితం అనార్యోగంతో సుందరరావు మృతి చెందాడు. చిన్నమ్మి, ఆమె పిల్లలు, రస్మో కలిసి ఉంటున్నారు. వారం రోజుల క్రితం కాపురానికి రమ్మని పిలవడానికి రస్మో భర్త చిరంజీవి లకేయిపుట్టు వచ్చాడు. గొడవలు మాని, కాపురానికి వెళ్లమని రస్మోకి ఆమె వదిన చిన్నమ్మి కూడా చెప్పింది. దీంతో రస్మో ఆగ్రహించింది. అయితే చిన్నమ్మిని ఏమీ అనలేకపోయింది. మంగళవారం ఉద యం గ్రామ సమీపంలో కర్రలు కొట్టడానికని చిన్నమ్మి కుమార్తె అను(6)(రస్మోకు మేనకోడలు)తో పాటు గ్రామానికి చెందిన పాంగి సంధ్యను రస్మో తీసుకెళ్లింది. చిన్నమ్మికోపంతో అక్కడ కట్టెలు కొట్టే కత్తితో అను మెడపై నరికి దారుణంగా హత్య చేసింది. ఈ విషయం గమనించిన సంధ్యన గ్రామానికి పరుగున వచ్చి గ్రామస్తులకు సమాచారం ఇచ్చింది. హత్యచేసిన వెంటనే గ్రామంలో కుళాయి వద్దకు వచ్చి, వంటికి అంటిన రక్తాన్ని కడుగుకుంటూ ఉండగా రస్మోను గ్రామస్తులు పట్టుకుని చెట్టుకు కట్టారు. అనంతరం పెదబయలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులో తీసుకున్నారు. అను గ్రామంలో ఎంపీ ఎలిమెంటరీ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. చిన్నారి మృతదేహానికి పోస్టుమారానికి తరలించారు. కుమార్తె మృతి చెందడంతో తల్లి చిన్నమ్మి గుండెలవిసేలా రోదించింది. గ్రామంలోవిషాదఛాయలు అలము కున్నాయి. ముందురోజు రస్మోనాటుసారా పూటుగా తాగినట్టు గ్రామస్తులు తెలిపారు. -
‘మట్టు’ఆరకనే మట్టిపాలు చేశారు!
అనంతపురం ,మడకశిర రూరల్: మడకశిర మండలం సిద్దగిరి గ్రామ సమీపాన రాళ్లకుప్పపై ఏడుస్తున్న పసికందును అటువైపు వచ్చిన కొందరు యువకులు గమనించి, పోలీసులకు సమాచారమందించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రాళ్లకుప్పపై రాళ్లు గుచ్చుకుని, చీమలు, పురుగులు కుట్టడంతో ఏడ్చిఏడ్చి గుక్కపెట్టి ప్రాణం వదిలి ఉంటుందని తెలిసింది. ఈ అమానవీయ ఘటన తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారి నిర్వాకంపై మండిపడ్డారు. కళ్లు తెరవని కను‘పాప’ పేగుతెంచుకొని అప్పుడప్పుడే పుట్టింది.. అమ్మ పొత్తిళ్లలో.. వెచ్చని కౌగిలిలో కదలాల్సిన పసిపాప ముర్రుపాలు తాగి మురిపెంగా పెరగాల్సిన బిడ్డ.. ‘పూల’పాన్పుపై పెరగాల్సిన ‘పాప’ చీర కొంగు ఊయలలో.. జోలపాట ‘లాలన’లో..జోగాల్సిన ‘ఆడ’ శిశువు.. ఏ కన్నతల్లి ‘బిడ్డో’.. అభం శుభం తెలియని ‘ఆడ’బిడ్డ..అప్పుడే ఆయుష్షు నిండింది. ముళ్ల పొదల మాటున ..రాళ్లకుప్పల పాలైంది. ‘మట్టు’ఆరకనే మట్టిపాలు చేశారు! అక్కున చేర్చుకునేవారు దరిదాపున లేరు! ‘చలి’ చీమలు చుట్టుముట్టిపసిగుడ్డును తొలుస్తుంటే.. గుక్కపెట్టి ఏడ్చినా..చుట్టుపక్కల ఎవరూ లేరు.. ‘పాప’ం అన్న వాళ్లే లేరు! ఇదేమి ‘మాయ’లోకం.. మానవత్వం మరిచిందా.. ‘మమ’కారం చచ్చిందా ఎవరినీ నిందించలేని పసితనం ఆడజన్మ నాదే ‘పాప’ం అంటూ కళ్లు మూసింది. -
36 రోజుల పసికందును హతమార్చిన తండ్రి
కట్టంగూర్(నకిరేకల్) : రెండోకాన్పులోనూ ఆడపిల్ల పుట్టడం ఆ తండ్రికి ఇష్టం లేదు. పుట్టిన 36 రోజులకే ఆ పసికందును హతమార్చాడు. సిరప్‌లో పురుగుల మందు కలిపి తాగించడంతో ఆ పసికందు చనిపోయింది. ఎఫ్ఎస్ఎల్ నివేదికలో జాప్యంకారణంగా నిందితుడిని ఏడాది తర్వాత అరెస్ట్ చేశారు. సోమవారం కట్టంగూర్ పోలీస్‌స్టేషన్‌లో శాలిగౌరారం రూరల్ సీఐ క్యాస్ట్రోరెడ్డి విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. కట్టంగూర్ మండలం ఇస్మాయిల్పల్లి గ్రామానికి చెందిన పెంజర్ల ముత్తయ్య తన కూతరు పద్మను అదే గ్రామానికి చెందిన మేనల్లుడు బండారు పరుశురాములుకు ఇచ్చి వివాహం చేశాడు. పరశురాములు, పద్మ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు జన్మించారు. రెండో కూతురు లాస్య పుట్టిన 36 రోజులకు తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో తల్లిదండ్రులు స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. అప్పటికే కూతురు పుట్టడం పరశురాములుకు ఇష్టం లేదు. ఈ క్రమంలో అతను 2017, మార్చి 17న నార్కట్‌పల్లి వెళ్లాడు. స్థానిక దీపా మెడికల్ హాల్లో జ్వరానికి టానిక్‌తోపాటు ఎరువుల దుకాణంలో క్రిమి సంహాకర మందు కొన్నాడు. తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో మార్గమధ్యంలో టానిక్‌లో క్రిమి సంహారక మందు కలిపాడు. ఇంటికి వెళ్లి టానిక్‌ను తన భార్య పద్మకు ఇచ్చాడు. దీంతో తల్లి చిన్నారికి టానిక్ పోసింది. టానిక్ తాగిన కొద్ది సేపటికే వాంతులు చేసుకోవడంతో భయాందోళనకు గురైన తల్లి తిరిగి ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లింది. చిన్నారి పరిస్థితి సీరియస్‌గా ఉందని చెప్పడంతో నల్లగొండకు, నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు నిరాకరించటంతో హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే ఏడాది మార్చి 19న చనిపోయింది. అనుమానం వచ్చిన చిన్నారి తాతయ్య పెంజర్ల ముత్తయ్య తన మేనల్లుడు పరశురాములుపై ఫిర్యాదు చేయగా అప్పటి ఏఎస్ఐ యూసఫ్‌జానీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టానిక్‌ను హైదరాబాద్‌లోని ఎఫ్ఎస్ఎల్కు పంపగా పరీక్షించి అందులో ఆర్గానోఫాస్ఫేట్ యాన్ ఇన్సెక్టిసైడ్ పాయిజన్ ఉందని రెండు రోజుల క్రితం రిపోర్ట్ వచ్చింది. పోస్టుమార్టం చేసిన డాక్టర్ కూడా కాజ్ ఆఫ్ డెత్ ఆర్గానోఫాస్ఫరస్ పాయిజన్ అని ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఎస్ఐ రంజిత్ మర్డర్ కేసుగా నమోదు చేశారు. సోమవారం నిందితుడు పరశురాములును స్వగ్రామంలో పట్టుకుని స్టేషన్‌కు తరలించి విచారించారు. దీంతో నిందితుడు నార్కట్‌పల్లిలో టానిక్ కొనుక్కొని పురుగుల మందు కలిపి తన భార్యకు ఇవ్వటంతో చిన్నారి చనిపోయిందని, మొదటి సంతానంతో పాటు రెండవ సంతానం కూడా కూతురు కావడంతో సాకే స్థోమత లేక చంపుకున్నానని ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. సమావేశంలో ఎస్ఐ రంజిత్ ఉన్నారు. -
అది నరబలే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో సంచలనం సృష్టించిన నరబలి కేసులో చిక్కుముడి వీడింది. ఉప్పల్‌లోని చిలుకానగర్ ఇంటి యజమాని రాజశేఖర్, అతని భార్య శ్రీలత క్షుద్రపూజల పేరిట ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారని రాచకొండ పోలీసులు తేల్చారు. నరబలి ఇస్తే శ్రీలత ఆరోగ్యం మెరుగు పడుతుందని ఓ కోయ దొర చెప్పిన మాటలతో వీరు ఈ దారుణానికి పాల్పడ్డారని వెల్లడించారు. క్షుద్రపూజలు చేసిన గదిలో లభించిన రక్తపు మరకలు, శిశువు తల భాగం నుంచి సేకరించిన డీఎన్ఏ నమూనాలతో సరిపోలడంతో ఈ కేసులో స్పష్టతకు వచ్చిన పోలీసులు.. రాజశేఖర్, అతని భార్య శ్రీలతను గురువారం అరెస్టు చేశారు. కేసు వివరాలను ఎల్బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయంలో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ మీడియాకు తెలిపారు. కోయదొర చెప్పిన మాటలతో.. ఉప్పల్‌లోని చిలుకానగర్‌లో తేరుకొండ రాజశేఖర్, శ్రీలత నివాసం ఉంటున్నారు. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్ భార్య శ్రీలత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఎందరు వైద్యులను సంప్రదించినా మార్పురాలేదు. రెండేళ్ల క్రితం సమ్మక్క–సారక్క జాతరకు వెళ్లిన రాజశేఖర్ దంపతులు అక్కడి ఓ కోయదొరను ఆశ్రయించారు. నరబలి ఇస్తే ఆమె ఆరోగ్యం కుదుటపడుతుందని అతడు తెలిపాడు. ఆ తర్వాత కూడా శ్రీలత ఆరోగ్యం కుదుటపడాలనే ఉద్దేశంతో పలువురు మంత్రగాళ్లను ఆశ్రయించినా.. పరిస్థితి మెరుగు పడకపోవడంతో నరబలికి సిద్ధమయ్యారు. బోయిగూడలో శిశువు అపహరణ.. జనవరి 31న రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల సమయంలో బోయగూడలో రెక్కీ చేసిన రాజశేఖర్ మూడు నుంచి ఆరు నెలల వయసున్న ఆడ శిశువు విచక్షణాజ్ఞానం లేని తల్లిదండ్రుల వద్ద ఉన్నట్టు గుర్తించాడు. చంద్రగ్రహణం రోజున నరబలి ఇవ్వాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి ఒకటో తేదీన అర్ధరాత్రి 12.45 గంటలకు ఇంటి నుంచి కత్తి, పాలిథిన్ బ్యాగ్‌లను తీసుకుని ఏపీ20టీవీ1646 కారులో బయలుదేరి 1.30 గంటలకు బోయిగూడ చేరుకున్నాడు. ఫుట్‌పాత్‌పై ఆదమరిచి నిద్రిస్తున్న చిన్నారిని అపహరించి పీర్జాదిగూడ ప్రతాపసింగారం మూసీ కాలువ వద్దకు రెండు గంటలకు తీసుకెళ్లి శిశువు గొంతు, మొండెంను కత్తితో నరికి వేరుచేశాడు. శిశువు మొండెం, కత్తిని మూసీలో పడేసి పాలిథిన్ కవర్లో తలను తీసుకుని తెల్లవారుజామున మూడు గంటలకు ఇంటికి చేరుకున్నాడు. నగ్నంగా భార్యాభర్తల క్షుద్రపూజలు తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటల మధ్య శిశువు తలను పెట్టి భార్యాభర్తలిద్దరూ నగ్నంగా క్షుద్రపూజలు చేశారు. అనంతరం శిశువు తలకు సూర్యకిరణాలు పడేలా ఇంటిపై తలను ఉంచి కిందికి వచ్చారు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా రాజశేఖర్ క్యాబ్‌ను తీసుకుని మాదాపూర్‌కు బయలుదేరాడు. 10.20కి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. రాజశేఖర్ అత్తమ్మ వీరకొండ బాలలక్ష్మి ఉదయం 11 గంటలకు బట్టలు ఆరేసేందుకు భవనంపైకి వెళ్లి శిశువు తలను చూసి కేకలు వేసింది. ఈ మేరకు అందిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శిశువు తలను గాంధీ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. రాజశేఖర్ ఇంట్లో దొరికిన రక్తనమూనాలు శిశువు డీఎన్ఏతో సరిపోలాయని ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన నివేదికతో రాజశేఖర్, శ్రీలతను పోలీసులు అరెస్టు చేశా రు. క్షుద్రపూజలకు రాజశేఖర్ వాడిన వస్త్రాలను, దాచిన బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పౌర్ణమి నుంచి అమావాస్య వరకు నరబలి జరిగిన పౌర్ణమి నుంచి అమావాస్య వరకు అంటే 2 వారాల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది. 45 మందిని విచారించామని, ఆధారాల కోసం 112 ఫోన్‌కాల్స్, 54 సెల్ టవర్ల డేటాను సేకరించామని, 40 మంది సాక్షులను, వందకుపైగా సీసీ కెమెరా పుటే జీలను పరిశీలించామని, డీఎన్ఏ రిపోర్ట్ ద్వారా నరబలికి గురైంది ఆడ శిశువుగా గుర్తించామని, డీఎన్ఏ ఫలితాలతో నిందితులు దొరికిపోయారని సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. వీరిని విచారిస్తే ఈ కేసుపై పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు. -
అమ్మ జన్మపై కత్తి
నెల్లూరు(బారకాసు): ఆడపిల్ల లేని ఇల్లు చందమామ లేని ఆకాశం ఒకటే.. నేటి ఆడ పిల్లే రేపటి అమ్మ. ఈరోజు ఆడపిల్లను వద్దనుకుంటే రేపు సమాజం అమ్మలేని అనాథవుతుంది.ఇవి ఆడపిల్లను కాపాడుకుందామని ప్రభుత్వం ఇచ్చిన నినాదాలు. భ్రూణ హత్యలు నివారించి బాలికల నిష్పత్తిని పెంచేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం మార్పు రావడం లేదు.గర్భస్థ పిండలింగ నిర్ధారణ చట్ట రీత్యా నేరమని తెలిసినా కొందరు యథేచ్ఛగా పుట్టబోయేది ఆడ లేదా మగ అని చెప్పేస్తున్నారు. దీంతో ప్రభుత్వ నినాదాలు ఆస్పత్రుల గోడలకే పరిమితమవుతున్నాయి. ఫలితంగా జిల్లాలో బాలికల నిష్పత్తి రోజురోజుకు తగ్గిపోతోంది. లెక్కలు చూస్తే.. 2001 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో స్త్రీ, పురుషుల నిష్పత్తి కాస్త పెరిగినా 0–6 ఏళ్లలోపు బాలబాలికల నిష్పత్తి మాత్రం గణనీయంగా పడిపోయింది. 2001 నాటికి అప్పటి రెండు, తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో (ఏపీలో) ప్రతి వెయ్యి మంది పురుషులకు 978 మంది మహిళలున్నారు. 2011 సంవత్సరం నాటికి మహిళల సంఖ్య 936గా నమోదైంది. జిల్లా విషయానికి వస్తే 2001లో 1000 మంది పురుషులకు 984 మంది స్త్రీలున్నారు. 0–6 ఏళ్లలోపు ఉన్న ప్రతి వెయ్యి మంది బాలురకు 955 మంది బాలికలున్నారు. 2011లో స్త్రీల సంఖ్య 986కు చేరుకుంది. 2017కి 0–6 ఏళ్లలోపు వారిలో ప్రతి వెయ్యి మంది బాలురకు 945 మంది బాలికలున్నారు. ఈసంఖ్య గణ నీయంగా తగ్గింది. ప్రతి వెయ్యి మంది బాలురకు 953 మందికి పైగా బాలికలుండాలని వైద్యారోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. పట్టించుకునే వారేరీ? స్కానింగ్ కేంద్రాలు ఇష్టారీతిగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయి. దీంతో భ్రూణ హత్యలకు ఆస్కారం ఇచ్చినట్లవుతోంది. జిల్లాలో ఇప్పటివరకు ప్రభుత్వ అనుమతి పొందిన కేంద్రాలు 209 ఉన్నాయి. మరికొన్ని కేంద్రాలు అనుమతి లేకుండానే పనిచేస్తున్నాయి. వీటిపై నిఘా పెట్టాల్సిన జిల్లా వైద్యారోగ్యశాఖ ఆదిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. గతంలో పనిచేసిన డీఎంహెచ్ఓలు కొన్ని స్కానింగ్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి తూతూమంత్రంగా చర్యలు చేపట్టారు. ముఖ్యం గా ఉదయగిరి, ఆత్మకూరు, నాయుడుపేట, కావలి, గూడూరు, నెల్లూరు నగరంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఏర్పాటుచేసుకున్న సొంత స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. మరికొన్ని ఆస్పత్రుల్లో నిషేధిత పోర్టబుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాలను వినియోగిస్తున్నట్లు సమాచారం. కాసుల వేటలో.. అప్పటికే ఆడపిల్ల సంతానం కలిగిన వారిలో కొందరు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. మళ్లీ ఆడపిల్లని తెలిస్తే భ్రూణ హత్యలకు ఒడిగడుతున్నారు. వైద్యులు కొందరు డబ్బుల కోసం యథేచ్ఛగా అబార్షన్లు చేస్తున్నారు. దీంతో జిల్లాలో బాలిక నిష్పత్తి తగ్గిపోతోంది. చర్యలు తీసుకోవాల్సిన వైద్యారోగ్య శాఖాధికారులు మాముళ్ల మత్తులో మునిగి తేలుతున్నట్లు విమర్శులున్నాయి. ఎక్కడైనా ఘటన జరిగినప్పుడు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పందిస్తున్నారే తప్ప ఆ తర్వాత పట్టించుకోవడంలేదు. లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ చేసినట్లు రుజువైతే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇటువంటి ఘటనులు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలి. త్వరలోనే స్కానింగ్ సెంటర్లపై నిఘా పెడతాం. ఇప్పటికే ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేశాం. అనుమతి లేకుండా స్కానింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. నానాటికి తగ్గిపోతున్న బాలికల నిష్పత్తిని పెంచేందుకు కృషి చేస్తున్నాం. – డాక్టర్ వరసుందరం, డీఎంహెచ్ఓ, నెల్లూరు -
అదృశ్యమైన చిన్నారి ఆరాధ్య దారుణ హత్య
ప్రకాశం: ఏడాదిన్నర వయసున్న ఓ చిన్నారి దారుణ హత్యకు గురైన ఘటన ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నగరంలో బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఆరాధ్య అనే ఏడాదిన్నర చిన్నారి మంగళవారం అదృశ్యమైన సంగతి తెలిసిందే. కోండ్రు లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఆరాధ్యను గొంతునులిమి, పెట్రోల్ పోసి నిప్పుపెట్టి అతిదారుణంగా చంపేశాడు. నిందితుడు చిన్నారికి బాబాయ్. లక్ష్మీనారాయణ తన భార్యతో సన్నిహితంగా ఉండటానికి పాప అడ్డుగా ఉందని ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. పోలీసులు నిందితుడుని అరెస్ట్ చేశారు. కాగా, ఒంగోలు నగరంలోని రాజపానగల్ రోడ్డులోని 7వ లైనులో నివాసం ఉంటున్న కుందా ఆరాధ్య మంగళవారం మధ్యాహ్నం నుంచి కనపడకుండా పోయింది. దాంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. తల్లి సాహితీ ఇంట్లో పనిచేస్తుండగా పాప ఇంటి బయట ఆడుకుంటోంది. తరువాత పాప కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
అదృశ్యమైన చిన్నారి ఆరాధ్య దారుణ హత్య