మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
ఉప్పల్: ఓ పక్క మహిళా దినోత్సవం జరుపుకోవడానికి సిద్ధమవుతుండగా మరో పక్క అప్పుడే పుట్టిన ఆడపిల్లను గొంతు నులిమి హత్య చేసిన సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన మేరకు.. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసికందును గుడ్డలో చుట్టి చిలుకానగర్ దారిలోని నాలా పక్కన గల శ్మశానవాటికలో చెట్ల పొదల్లో వదిలేసి వెల్లిపోయారు. మృతదేహంపై బొడ్డు అలాగే ఉందని, అప్పటికే సగభాగం కుళ్లిపోయి ఉందని పోలీసులు గమనించారు.
ఉప్పల్ జీహెచ్‌ఎంసీలో స్వీపర్‌గా పని చేస్తున్న కంబాల లక్ష్మీ(40) శ్మశానవాటిక వద్ద రోడ్డు ఊడ్చుతుండగా దుర్వాసన వచ్చింది. వెంటనే శ్మశానవాటికలోని చెట్ల పొదల వద్ద వెళ్లి చూడగా మృతిచెందిన ఆడశిశువు కనబడింది. దీంతో వెంటనే 108కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టుమార్ట్రం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment