
మృత శిశువు
అనంతపురం ,మడకశిర రూరల్: మడకశిర మండలం సిద్దగిరి గ్రామ సమీపాన రాళ్లకుప్పపై ఏడుస్తున్న పసికందును అటువైపు వచ్చిన కొందరు యువకులు గమనించి, పోలీసులకు సమాచారమందించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రాళ్లకుప్పపై రాళ్లు గుచ్చుకుని, చీమలు, పురుగులు కుట్టడంతో ఏడ్చిఏడ్చి గుక్కపెట్టి ప్రాణం వదిలి ఉంటుందని తెలిసింది. ఈ అమానవీయ ఘటన తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారి నిర్వాకంపై మండిపడ్డారు.
కళ్లు తెరవని కను‘పాప’
పేగుతెంచుకొని అప్పుడప్పుడే పుట్టింది..
అమ్మ పొత్తిళ్లలో.. వెచ్చని కౌగిలిలో కదలాల్సిన పసిపాప
ముర్రుపాలు తాగి మురిపెంగా పెరగాల్సిన బిడ్డ..
‘పూల’పాన్పుపై పెరగాల్సిన ‘పాప’
చీర కొంగు ఊయలలో.. జోలపాట ‘లాలన’లో..జోగాల్సిన ‘ఆడ’ శిశువు..
ఏ కన్నతల్లి ‘బిడ్డో’.. అభం శుభం తెలియని ‘ఆడ’బిడ్డ..అప్పుడే ఆయుష్షు నిండింది.
ముళ్ల పొదల మాటున ..రాళ్లకుప్పల పాలైంది.
‘మట్టు’ఆరకనే మట్టిపాలు చేశారు!
అక్కున చేర్చుకునేవారు దరిదాపున లేరు!
‘చలి’ చీమలు చుట్టుముట్టిపసిగుడ్డును తొలుస్తుంటే..
గుక్కపెట్టి ఏడ్చినా..చుట్టుపక్కల ఎవరూ లేరు..
‘పాప’ం అన్న వాళ్లే లేరు!
ఇదేమి ‘మాయ’లోకం..
మానవత్వం మరిచిందా.. ‘మమ’కారం చచ్చిందా
ఎవరినీ నిందించలేని పసితనం
ఆడజన్మ నాదే ‘పాప’ం అంటూ కళ్లు మూసింది.
Comments
Please login to add a commentAdd a comment