13మంది బుకీల అరెస్ట్‌ | cricket betting members arrest | Sakshi
Sakshi News home page

13మంది బుకీల అరెస్ట్‌

Published Wed, Dec 13 2017 6:40 PM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM

cricket betting members arrest

విజయవాడ: క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు అయింది. మొత్తం 13మంది బుకీలను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని సింగ్ నగర్‌లో ఓ ఇంట్లో రహస్యంగా క్రికెట్ బెట్టింగ్‌ నడుస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆన్‌లైన్, మొబైల్ యాప్‌లతో ఈ ముఠా బెట్టింగ్‌ నిర్వహిస్తోంది. విజయవాడ కేంద్రంగా పనిచేస్తూ రాష్ట్రంలోని పలువురు ఏజెంట్లతో ఈ ముఠా సంబంధాలు పెట్టుకున్నట్లు సమాచారం. వీరినుంచి 24 సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ బెట్టింగ్‌ వలలో ఎక్కువగా యువత చిక్కుకుంటోంది. ఇటీవలే తేజు అనే ఇంజనీరింగ్ విద్యార్ధి బెట్టింగ్‌లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement