
కొపెన్‌హాగెన్, డెన్మార్క్ : అదృశ్యమైన స్వీడన్ మహిళా జర్నలిస్టు విగత జీవిగా కనిపించారు. అది కూడా కేవలం తల, కాళ్లు మాత్రమే ముక్కలుముక్కలుగా లభించాయి. ఈ విషయాన్ని డానిష్ పోలీసులు స్పష్టం చేశారు. సొంతంగా ఓ జలాంతర్గామిని తయారు చేసిన పీటర్ మాడ్సన్‌ను అదే జలాంతర్గామిలో ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లిన స్వీడన్‌కు చెందిన కిమ్ వాల్ అనే మహిళా జర్నలిస్టు కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. అయితే, ఆమెకోసం గాలిస్తున్న పోలీసులకు సముద్రంలో రెండు బ్యాగులు లభించాయి.
ఒక బ్యాగ్‌లో తల రెండు కాళ్లు ఉండగా మరో బ్యాగులో ఆమె దుస్తులు ఇతర వస్తువులు కనిపించాయి. విడి భాగాలను ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపించగా అవి జర్నలిస్టు కిమ్ వాల్‌వేనని స్పష్టం చేశారు. తొలుత ఆగస్టు 21న తల లేని ఆమె మొండెం భాగం మాత్రమే కోపెన్ హాగన్‌లోని సముద్రంలో పోలీసులకు లభించగా మిగతా భాగాలను కూడా గాలించి చివరకు నిర్ధారించారు. ఈ హత్యలో పీటర్ మ్యాడ్‌సన్‌ను నిందితుడిగా చేర్చారు. కిమ్ వాల్ ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment