
నికోలస్ మదురో
కరాకస్, వెనెజులా : వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై డ్రోన్లతో దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి హాని కలుగలేదు. దేశ రాజధాని కరాకస్‌లో వేల మంది సైనికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తుండగా ఆయుధ సామర్ధ్యం కలిగిన డ్రోన్లు పేల్చివేశారు. ఈ మేరకు వెనెజులా ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. నేషనల్ గార్డ్స్ 81వ వార్షికోత్సవం సందర్భంగా సైనికులను ఉద్దేశించి మదురో ప్రసంగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
విచారణలో డ్రోన్ల ద్వారా బాంబు పేల్చినట్లు తేలింది. పేలుడు తర్వాత హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైరింజన్లు మంటలను ఆర్పివేశాయి. అయితే, ఇది నిజంగా డ్రోన్ దాడి కాదని, దగ్గరలోని అపార్ట్‌మెంటులో గ్యాస్ ట్యాంక్ పేలి ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment