పట్టుబడిన నకిలీ విత్తనాలతో టాస్క్‌ఫోర్స్ సీఐ స్వామి, పట్టణ సీఐ మహేశ్, సిబ్బంది
మంచిర్యాలక్రైం: నకిలీ పత్తి విత్తనాల రవాణాపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం పంజా విసిరారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గాంధీపార్క్ సమీపంలోని బ్యాట్కో ట్రాన్స్‌ఫోర్టు ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు టాస్స్‌ఫోర్స్ సీఐ బుద్దె స్వామి, పట్టణ సీఐ మహేశ్ ఆకస్మిక దాడి చేసి సుమారు రూ. 10లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు నకిలీ పత్తి విత్తనాలు (సిద్ధి 303) తరలించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నకిలీ పత్తి విత్తనాలను విక్రయించేందుకు ట్రాన్స్‌ఫోర్టుకు తీసుకువచ్చారని తెలిపారు. స్వాధీనం చేసుకున్న 20 బస్తాలను, తరలిస్తున్న మంచిర్యాలకు చెందిన అజయ్‌శర్మను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment