
బండి నరేష్
పశ్చిమగోదావరి,పెరవలి: కూతురు పుట్టిందని ఎంతో ఆనందించిన తండ్రికి ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. పుట్టిన రెండు రోజులకే కూతురు మృతి చెందటంతో మనస్తాపం చెందిన తండ్రి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ çఘటన పెరవలి మండలం ఖండవల్లిలో జరిగింది. పెరవలి ఎస్సై కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. ఖండవల్లి గ్రామానికి చెందిన బండి నరేష్(35)కు ఐదేళ్ల క్రితం వివాహం అయ్యింది. గత నెల 30వ తేదీన భార్యకు ఆడపిల్ల పుట్టడంతో ఆనందించాడు. ఈనెల 2వ తేదీన పుట్టిన బిడ్డ మృతి చెందటంతో తీవ్ర మనస్తాపం చెంది అదేరోజు పురుగుమందు తాగాడు. అతనిని ఏలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment