ప్రమాదంలో కాలిపోయిన పత్రాలు
భువనేశ్వర్: స్థానిక క్యాపిటల్ పోలీస్‌స్టేషన్ బ్యారక్‌లో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. ప్రమాదం సంభవించిన గదిలో పలు కీలక కాగిత పత్రాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ప్రమాదం సంభవించింది. ఫేన్ తిరుగుతుండగా గాలికి విద్యుత్ రవ్వలు రగలడంతో మంటలు గది అంతా విస్తరించాయి.
చేరువలో వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో ప్రమాదం బీభత్సంగా మారింది. అదృష్ట వశాత్తు ప్రాణనష్టం సంభవించ లేదు. సిబ్బంది సత్య ప్రకాశ్ మంత్రి ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు.
ఆయన ఆరోగ్య పరిస్థితి స్థితమితంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. అగ్నిమాపక దళం సకాలంలో రంగంలోకి దిగి సేవల్ని అందజేయడంతో మంటల విస్తరణ అదుపులోకి వచ్చింది. ఆస్తి నష్టం అంచనా కొనసాగుతోందని క్యాపిటల్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌చార్జి మానస్ గొడొనాయక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment