కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలు
కుటుంబంలో ఒకరు అనారోగ్యం పాలయ్యారు. చికిత్స కోసం అతడిని తీసుకుని కుటుంబ సభ్యులు వచ్చారు. చికిత్స అనంతరం తిరుగుప్రయాణ మయ్యారు. ఇంతలోనే దురదృష్టం వెంటాడింది. వేగంగా దూసుకొచ్చిన లారీ వారి ప్రాణాలను బలి తీసుకుం ది. శాంతిపురం మండలం కడపల్లి సమీపంలో మంగళవారం జరిగిన ఘోర దుర్ఘటనలో ఐదుగురు చనిపోయారు. వీరంతా తమిళనాడు వాసులే.
శాంతిపురం:తమిళనాడులోని జిల్లా కేంద్రమైన ధర్మపురి సమీపంలో ఉన్న వల్లగట్టూరుకు చెందిన చిన్నస్వామి(40)కి పక్షవాతం వచ్చింది. పలమనేరు సమీపంలో ని విరూపాక్షపురంలో నాటు వైద్యంతో వ్యాధి నయమవుతుందని ఇతని కుటుం బ సభ్యులు తెలుసుకున్నారు. చిన్న స్వామితో పాటు విరూపాక్షపురం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం ఉదయం కారులో అతన్ని వెంటబెట్టుకుని సోదరి కృష్ణమ్మ (68), బంధువులు శేఖర్(45), మోహన్‌కుమార్(38), దారి చూపడం కోసం అదే గ్రామానికి చెందిన రంగప్ప(60) వచ్చారు. వీరిలో మోహన్‌కుమార్, శేఖర్‌లు అన్నదమ్ములు. కృష్ణమ్మదికోయిలర్‌కొటార్ గ్రామం. వీరంతా ఉదయం చేరుకుని చిన్నస్వామికి చికిత్స చేయించారు. పక్షవాత నివారణ మందు తీసుకున్నారు. మధ్యాహ్నం భోజనం చేసి తిరుగుపయనమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారును కడపల్లి సమీపంలోని బొమ్మలగుట్ట సమీపానికి రాగానే ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది.
కారు తుక్కుతుక్కుగా మారింది. ముందు వరసలో ఉన్న వారు పూర్తిగా ఇరుక్కుపోయి నలిగిపోయారు. రాళ్లబూదుగూరు, కుప్పం పోలీ సులు ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేశారు. స్థానికులు, రోడ్డున వెళ్లేవారు, పోలీసులు అతికష్టం మీద వారిని కారులోంచి బయటకు తీశారు. తీవ్రంగా గాయపడటంతో ఐదుగురూ చనిపోయారు. తమిళనాడులోని తిరుపత్తూరు నుంచి వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరుకు వెళ్తూ ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసు కున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని రాళ్లబూదుగూరు స్టేషన్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన మృతదేహాలను కుప్పం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ఎస్పీ రాజశేఖరబాబు ఘటన స్థలాన్ని సందర్శించి మృతదేహాలను పరిశీలించారు. జాతీయ రహదారిలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గమనించి వేగ నియంత్రణ చర్యలు తీసుకోవాలని కుప్పం సీఐ రాఘవన్, ఎస్‌ఐ వెంకటశివకుమార్‌లకు సూచించారు. అతివేగమే ప్రాణాలను బలి తీసుకుందని గుర్తించారు. సాయంత్రానికి మృతుల కుటుంబ సభ్యులు చేరుకున్నారు. వారంతా కన్నీరుమున్నీరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment