బోరు బావి వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు
భోపాల్ : మరో పసి ప్రాణం కోసం తల్లిదండ్రుల గుండెలవిసేలా విలపిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో నాలుగేళ్ల ఓ చిన్నారి బోరు బావిలో పడిపోయాడు. దేవాస్ జిల్లా ఉమరియా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తల్లిదండ్రులతో పోలానికి వెళ్లిన ఆ చిన్నారి.. ఆడుకుంటూ అటుగా వెళ్లి బావిలో పడిపోయాడు. అది గమనించిన తల్లి గ్రామస్థులను అప్రమత్తం చేసింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగి ఆ బాబును బయటికి తీసేందుకు యత్నిస్తున్నారు. సుమారు 40 అడుగుల లోతున బోర్ బావిలో రోషన్ ఇరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
జిల్లా కలెక్టర్ పరిస్థితిని ఎప్పటి కప్పుడు సమీక్షిస్తున్నారు. అవసరమైతే ఎన్డీఆర్‌ఎఫ్‌ను రంగంలోకి దించేందుకు యత్నాలు సాగుతున్నాయి. గతేడాది మధ్యప్రదేశ్‌లోనే సత్యం అనే 5 ఏళ్ల బాలుడు 100 అడుగుల బోర్ బావిలో పడిపోగా.. అతని కాపాడేందుకు 48 గంటలకు పైగా అధికారులు శ్రమించి విఫలమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment