సర్పంచ్‌ చేతిని కొరికిన పోలీస్‌ | Goa Police Constable Booked For Biting Village Sarpanch | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ చేతిని కొరికిన పోలీస్‌

Published Sat, Jun 30 2018 7:17 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

Goa Police Constable Booked For Biting Village Sarpanch  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పనాజీ: గ్రామ సర్పంచి చేతిని కొరికిన పోలీసు కానిస్టేబుల్‌పై శనివారం ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఈ సంఘటన గోవాలో చోటుచేసుకుంది. నిందితుడు గెను వెలిప్‌పై పోలీసులు సెక్షన్‌-324(గాయపర్చడం) కింద కేసు నమోదు చేశారు. అక్రమ నీటి కనెక్షన్‌ విషయంలో సర్పంచ్‌, కానిస్టేబుల్‌ ఇద్దరూ గొడవపడినట్లు తెలిసింది. కాటిగోవా సర్పంచి ఉమేష్‌ గోవాన్కర్‌ చేతిని రెండు సార్లు కానిస్టేబుల్‌ గెను వెలిప్‌ కొరికినట్లు ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

కొరికిన గాటు గుర్తులను, నిందితుడి పంటి గుర్తులను డెంటల్‌ ఫోరెన్సిక్‌ పద్ధతిలో తాము తీసుకున్నామని, రెండింటినీ సరిపోల్చి చూస్తామని, నేరం నిరూపితమైతే నిందితుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారి రాజేంద్ర ప్రభు దేశాయ్‌ మీడియాకి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement