
గాయని హర్షితా దహియా.. యూట్యూబ్ వీడియో స్ర్కీన్ షాట్స్
సాక్షి, న్యూఢిల్లీ: హరియాణా జానపద గాయని హర్షితా దహియాను తన భర్తే కాల్చి చంపాడని ఆమె సోదరి ఆరోపించారు. 'మా అమ్మ హత్య కేసులో సాక్షిగా ఉండటంతో ఆమెను నా భర్తే చంపేశాడు' అని హర్షితా సోదరి లతా మీడియాకు తెలిపారు.
హరియాణా పానిపట్‌లో సంగీత ప్రదర్శన ఇచ్చిన అనంతరం ఢిల్లీకి వస్తుండగా హర్షితాను కొందరు గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపిన సంగతి తెలిసిందే. ఆమె శరీరంలోకి ఐదుబుల్లెట్లు దూసుకెళ్లాయి. తనపై బావ లైంగిక దాడి జరిపాడని గతంలో హర్షితా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో హర్షితా ఇటీవల యూట్యూబ్‌లో ఒక వీడియోను పోస్టు చేసింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని ఆ వీడియోలో తెలిపింది. దీంతో ఆమె హత్య కేసులో ఇతర నిందితుల ప్రమేయం కూడా ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment